కొత్త ట్విస్ట్: బిగ్ షాట్స్ హత్యకు ఉగ్ర కుట్ర! | IS plans to kill big shots in Hyderabad.

Isis plans to kill big shots in hyderabad

ISIS in Hyderabad, NIA in Hyderabad, ISIS plans in Hyderabad

Shocking facts in NIA inquiry, IS plans to kill big shots in Hyderabad.

కొత్త ట్విస్ట్: బిగ్ షాట్స్ హత్యకు ఉగ్ర కుట్ర!

Posted: 07/14/2016 01:39 PM IST
Isis plans to kill big shots in hyderabad

హైదరాబాద్ లో పెను విధ్వంసానికి ప్రణాళిక రచించిన ముష్కరమూక మొత్తం 13 చోట్ల పేలుళ్లకు కుట్ర పన్నిందన్న వార్త నగర వాసుల్లో కలకలం రేపుతోంది. ఇందులో పోలీసు స్టేషన్లు, జన సమ్మర్థమున్న మాల్స్, రక్షణ రంగ సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయని ఇప్పటికే మనకు తెలుసు. వీటన్నిటి వివరాలతో ఇక్కడి నుంచి విదేశాల్లో ఉన్న వారి బాస్ లకు ఎప్పటికప్పుడు ఈ-మెయిల్స్ తదితర మాధ్యమాల ద్వారా సమాచారం పంపుతున్నారని ఎన్ఐఏ తెలిపింది. అంతేకాదు విచారణలో వెలుగు చూస్తున్న మరిన్ని షాకింగ్ విషయాలను బయటపెడుతోంది. రాష్ట్రంలోని ఆరుగురు ప్రముఖ వ్యాపారవేత్తలను హత్య చేయాలని కూడా వీరు కుట్ర పన్నారని తేల్చారు.

నగరానికి చెందిన ఈ ఆరుగురి ప్రముఖులపై నిఘా పెట్టిన పట్టుబడిన ఐదుగురు వారి ఇంటి వద్ద రెక్కీ నిర్వహించారు. వారి ప్రతీ కదలికను జాగ్రత్తగా పరిశీలించిన ఎప్పటికప్పుడు ఆ నివేదికను హైకమాండ్ కు పంపారంట. ముందు కిడ్నాప్ చేసి భారీ మొత్తంలో డబ్బు గుంజడం, ఆపై వీరిని చంపడం ద్వారా పోలీసులు ఆ విచారణలో ఉండగా, తమ పని చేసుకునేందుకు ఈజీ అయిపోతుందనేది వారి ఫ్లాన్. ఇక ఐసిస్ అనుబంధ జేకేబీహెచ్ (జుందుల్ ఖిలాఫత్ ఫీ బిలాద్ అల్ హింద్)కు నిధులందించిన ఫైనాన్షియర్లను తక్షణం అదుపులోకి తీసుకోకుంటే, మరో ఉగ్ర బృందం వారి కార్యాచరణ అమలుకు ఏర్పడుతుందని ఎన్ఐఏ ఆందోళన చెందుతోంది. వీరిని గుర్తించేందుకు ఉగ్రవాదులను మరింతగా విచారించాల్సి వుందని అధికారులు అంటున్నారు.

రాజస్థాన్ ప్రాంతం నుంచి హవాలా ఏజంట్ల ద్వారా ఇక్కడి ఉగ్రవాదులకు నిధులు వచ్చాయని, ఇవి రియాల్స్ కరెన్సీలో రాగా, వాటిని ఇక్కడే మార్చుకున్నారని కూడా విచారణలో వెల్లడైంది. అరెస్టయిన నిందితులు తమ మనసులో ఉన్న పూర్తి వివరాలను వెల్లడించడం లేదని అభిప్రాయపడుతున్న విచారణాధికారులు, ఇప్పటికే ఇదే విషయాన్ని కోర్టుకు సైతం వెల్లడించారు. ప్రస్తుతం కస్టడీలో ఉన్న వారినిరెక్కీ నిర్వహించిన ప్రాంతాలకు తీసుకెళ్లి ఆధారాలు సేకరించాలని భావిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hyderabad  NIA  ISIS  big shots  

Other Articles