తమిళనాడుకు గంగా వాటర్ భలే వర్కవుట్ అయ్యింది | Gangajal is now available in chennai post offices

Gangajal is now available in chennai post offices

ganga jal in post office, gangajal in tamilnadu

Gangajal is now available in chennai post offices.

తమిళనాడుకు గంగా వాటర్ భలే వర్కవుట్ అయ్యింది

Posted: 07/13/2016 09:33 AM IST
Gangajal is now available in chennai post offices

టక్..టక్..టక్.. మనీ మీ తలుపు తడుతుంది... వెంటనే మీరు డోర్ ఓపెన్ చేస్తారు. ఇంతలో నవ్వుతూ పోస్ట్ మాన్ చేతిలో ఓ బాటిల్ తో దర్శనమిస్తాడు. సార్/మేడమ్ ఇదుగోనండి మీరు ఆర్డర్ చేసిన గంగా జలం అంటూ మీ చేతిలో పెడతాడు. పవిత్ర గంగా నీటి కోసం అంత దూరం వెళ్ల లేని వాళ్ల కోసం తమిళనాడు ప్రజలకు అక్కడి అధికారులు ఈ సౌకర్యం కల్పిస్తున్నారు.

వ్యయ ప్రయాసలతో కూర్చి గంగోత్రి, యమునోత్రి, రిషికేశ్‌ లాంటి పవిత్ర నదులను దర్శించుకోలేని ప్రజల కోసం పోస్టాఫీసుల ద్వారా గంగాజలాలను అమ్మనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు చెన్నైలోని అన్ని పోస్టాఫీసుల్లో గంగాజలాన్ని విక్రయానికి అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రయోగాత్మకంగా రెండు పోస్టాఫీసుల్లో ఈ బాటిళ్లను అమ్మకానికి ఉంచగా, విక్రయాలు ప్రారంభించిన నిమిషాల వ్యవధిలోనే అన్ని బాటిళ్లు అమ్ముడయ్యాయని అధికారులు తెలిపారు.

gangajal now available in chennai

500 మిల్లీలీటర్ల గంగోత్రి జలాన్ని 35 రూపాయలకు, 200 మిల్లీలీటర్ల బాటిల్ ధర 25 రూపాయలుగా నిర్ణయించారు. అలాగే రిషికేశ్‌ గంగాజలం బాటిల్ ధర 500 మిల్లీలీటర్లు 22 రూపాయలు కాగా, 200 మిల్లీలీటర్లు గంగాజలం 15 రూపాయలని వారు పేర్కొన్నారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా పవిత్ర గంగాజలం బాటిళ్లను విక్రయానికి అందుబాటులో ఉంచనున్నామని, ఆన్ లైన్ అమ్మకాలు కూడా ప్రారంభించనున్నామని అధికారులు తెలిపారు.

అయితే ఈ నీటిని నింపే ప్రక్రియ ఎవరూ చేస్తున్నారు? అదసలు నిజంగా గంగా జలమేనా? బాటిల్స్ లోని నీరు సురక్షితమైనదేనా అన్న ప్రశ్నలు ఇప్పుడు మొదలౌతున్నాయి. అధికారులు కూడా ఈ విషయంలో గోప్యతను ప్రదర్శించడం పలు అనుమానాలకు తావునిస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gangajal  Tamilnadu  Chennai post office  

Other Articles