రియల్ అపరిచితుడు... ఎక్కడో తెలుసా? | Russian Real Batman declared war on drug dealers

Russian real batman declared war on drug dealers

real aparichitudu in russia, Russian Real Batman, batman war on drug dealers, aparichitudu found in russia

Russian Real Batman declared war on drug dealers.

ITEMVIDEOS:రియల్ అపరిచితుడు... ఎక్కడో తెలుసా?

Posted: 07/12/2016 01:34 PM IST
Russian real batman declared war on drug dealers

తన చుట్టూ జరిగే పరిస్థితులు చూసి చూసి విసిగి వేసారి తనలోని మరో వ్యక్తిని నిద్రలేపి అన్యాయాలకు, అక్రమాలకు అడ్డుకట్టవేస్తాడు అపరిచితుడు. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో విక్రమ్ నటన ఇప్పటికీ మన కళ్ల ముందు కదలాడుతూనే ఉంటుంది. సరిగ్గా ఇప్పుడు రష్యాలో అలాంటి సీనే ఒకటి దర్శనమిస్తోంది. కాకపోతే వారికి బ్యాట్ మెన్ బాగా పాపులర్ కదా సో... ఆ గెటప్ లోనే దర్శనమిచ్చాడు అక్కడి అపరిచితుడు.

ఎక్కడి నుంచి వచ్చాడో తెలీదు కానీ, ఈ రియల్ అపరిచితుడు ఇప్పుడు రష్యాలో మాఫియాకు సు..సు.. పోయిస్తున్నాడు. ఇతనీ గురించి మచ్చుకు ఓ ఉదాహరణ ఇప్పుడు బయటికి వచ్చింది. మాస్కో శివారుల్లోని కిమ్కి ప్రాంతంలోని ఓ డ్రగ్ డెన్. అందులో ఉన్న ఇద్దరు డ్రగ్ పెడ్లర్లను వాటాలు పంచుకుంటున్నారు. ఇంతలో ఎక్కడి నుంచో వచ్చాడో తెలీదు గానీ ఓ ముసుగు వీరుడు వారిని చితకబాదాడు. అనంతరం తాపీగా బయకువచ్చి ఓ పొగబాంబు అక్కడ వేసి మాయమయ్యాడు. పోలీసులు సంఘటనా స్థలికి చేరుకోగా, ఈ ఘటన గురించి అక్కడే ఉన్న ట్యాక్సీ డ్రైవర్ సవివరంగా తెలిపాడు.

ఇప్పుడతను అక్కడ చాలా పాపులర్ అయిపోయాడు. అయితే ఆ ముసుగు వ్యక్తి తానెవరన్నది తెలపకపోయినా... అచ్చం అపరిచితుడు సినిమాలోలా తన ట్విట్టర్ లో 'రీపర్... మానవత్వానికి మొదటి హీరో' అంటూ సందేశాలు రాయటం మొదలుపెట్డాడు. ఇతని గురించిన ఆధారాల కోసం పరిశోధన చేసిన ఓ ప్రముఖ పత్రిక అతనెవరన్నది కనుక్కునే ప్రయత్నం చేసింది. అది కుదరకపోగా అతను పోలీసులకు రాసిన లేఖను పట్టేసి ప్రపంచానికి చూపింది.

‘సమాజంలో డ్రగ్స్, రేప్ లు నానాటికీ పెరిగిపోతున్నాయి. వీటిని అంతం చేయాల్సిన అవసరం ఉంది. నేరసామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో సమూలంగా నాశనం చేసేందుకు నాకు మీ సాయం కావాలి. నన్ను ప్రత్యేకంగా కలవాల్సిన అవసరం ఎవరికీ లేదు' ఈ సోషల్ మీడియా ద్వారా తనకు సమాచారం అందిస్తే చాలు. అలా అని నేను పోలీసులకు వ్యతిరేకం కాదు.. మీ చేతులు బంధించి ఉన్నాయని నాకు తెలుసు, మీకు సాధ్యం కానీ విషయాల్లోనే నేను జోక్యం చేసుకుంటా’’ అంటూ పేర్కొన్నాడు.

రష్యాలో రేపిస్ట్ లను, క్రిమినల్స్ ను పూర్తిగా ఏరిపారేంత వరకు నిద్రపోనని శపథం చేసిన రీపర్ ఇప్పుడు జనాల్లో ఓ రియల్ హీరో.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Russia  ream batman  war  drug dealers  rapists  

Other Articles