స్మగ్లింగ్ గూడ్స్ ను వెనక్కి రప్పించుకున్న సీఎం | Jayalalitha put efforts for back smuggling idols to India

Jayalalitha put efforts for back smuggling idols to india

Tamilnadu CM Jayalalitha smuggling Idols, Varadaraja Perumal temple stolen idols, stolen idols back to India

Tamilnadu CM Jayalalitha put efforts for back smuggling idols of Varadaraja Perumal temple to India.

స్మగ్లింగ్ గూడ్స్ ను వెనక్కి రప్పించుకున్న సీఎం

Posted: 07/12/2016 01:04 PM IST
Jayalalitha put efforts for back smuggling idols to india

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత స్మగ్లింగ్ గూడ్స్ ను వెనక్కి రప్పించి ఇప్పుడు వార్తల్లో నిలిచారు. సుమారు వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన విగ్రహాలను స్మగ్లింగ్ కింగ్ సుభాష్ కపూర్ అమెరికాకు తరలించగా, తానే స్వయంగా కల్పించుకుని అక్కడి అధికారులతో మాట్లాడి వాటిని వెనక్కి రప్పించగలిగింది.

అరియాల్లూర్ జిల్లా సుత్తమాలి గ్రామంలోని వరదరాజ పెరుమాళ్ గుడి నుంచి చోరీ కాబడ్డ రెండు పంచలోహా విగ్రహాల విలువ సుమారు 12 కోట్లు ఉంటుందని సమాచారం. గుడి పెద్దలు స్వయంగా జయలలితను కలిసి విజ్నప్తి చేయటంతో తానే ఈ విషయంలో జోక్యం చేసుకుంది. ఇక వీటితోపాటు మధ్యప్రదేశ్, కశ్మీర్ తదితర ప్రాంతాలకు చెందిన 8 విగ్రహాలను కూడా న్యూయార్క్ అధికారులు చెన్నై పోలీసులకు అప్పజెప్పారు.

మోదీ అమెరికా పర్యటనలోనే వీటిని అప్పజెప్పినప్పటికీ కాస్త ఆలస్యంగా విగ్రహాలను మన దేశానికి రప్పించారు. వీటిని ముందుగా న్యాయస్థానంలో అప్పజెప్పి, ఆపై ఎక్కడి ప్రాంతాలవి అక్కడికి తరలిస్తామని పోలీసులు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tamilnadu  CM Jayalalitha  Varadaraja Perumal temple  stolen idols  

Other Articles