స్టార్ కరెన్సీ నోట్లపై అలుముకున్న నీలినిడలు పటాపంచలయ్యాయి. వీటిని చలామణిలో వచ్చిన సందేహాలతో వాటిని నకిలీవని కొందరు ఆందోళనకు గురవుతుంటారు. అయితే ఆ స్టార్ గుర్తు ఉన్న నోట్లు మంచివే. ఇవి ప్రత్యేకమైనవి. వేల నోట్లలో ఒకటి మాత్రమే ఇటువంటివి ఉంటాయి. కరెన్సీ నోట్లు ముద్రించే విషయంలో రిజర్వు బ్యాంక్ సిబ్బంది అత్యంత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తారు. కరెన్సీ నోట్లపై సీరియల్ నంబర్లు కేటాయించే సమయంలో ముందుగా ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో మూడు నంబర్లు ముద్రిస్తారు. వాటి నుంచి కొంత ఖాళీ ఉంచి తర్వాత ఆరు నంబర్లు ముద్రిస్తారు. సీరియల్ నంబర్ల ఆధారంగా వంద నోట్లను ఒక కట్టగా కడతారు. అయితే ముద్రణా లోపం వల్ల కొన్ని నోట్లు పాడైపోతాయి.
అటువంటి నోట్ల స్థానంలో స్టార్ గుర్తు పెట్టి కొత్తనోటును ముద్రించి ఆ కట్టలో పెడుతారు. అటువంటి నోట్ ఉన్న కట్టపై ప్రత్యేకంగా స్టార్ గుర్తును కూడా ముద్రిస్తారు. తద్వారా ఆ కట్టలో స్టార్ గుర్తు ఉన్న నోటు ఉందని తెలుసుకోవచ్చు. అటువంటి నోట్లు వేలల్లో ఒకటి ఉంటాయి. అలా వచ్చిన అరుదైన రూపాయి, రూ.10, రూ.20, రూ.50 నోట్లను లక్కవరపుకోట స్టేట్ బ్యాంక్ మేనేజర్ ఏఎస్ఎన్ రాజు సేకరించారు. తాను 15ఏళ్లుగా ఇటువంటి నోట్లు సేకరిస్తున్నానని ఆయన చెప్పారు. అప్పటి నుంచి ప్రారంభిస్తే ఇప్పటికి రూపాయి, రూ.10, రూ.20, రూ.50 నోట్లు లభించాయని తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more