Video Shows Rajasthan Lawmaker's Son Drinking Before His BMW Ran Over 3

Jaipur hit and run case cctv shows mla s son in driver s seat

BMW accident, CCTV footage, Rajasthan BMW accident, Siddharth Maharia, Nand Kishore Maharia

In CCTV footage from Jaipur, three young men are seen drinking at a bar. The time is after midnight on July 2.

ఆ కారును నడిపింది శాసనసభ్యుడి తనయుడే..

Posted: 07/10/2016 08:22 AM IST
Jaipur hit and run case cctv shows mla s son in driver s seat

అధికారంలో వున్నది తమ ప్రభుత్వం, అనుకోకుండా జరిగిన ప్రమాదం నుంచి తన కొడుకును రక్షించుకునేందుకు రాజస్తాన్ ఎమ్మెల్యే ఎన్ని ఎత్తులు వేసినా.. వాటన్నింటినీ చిత్తు చేశారు పోలీసులు. చివరకు సిసిటీవీ ఫూటేజీలు, రిసిప్టులు అధారంగా పోలీసులు ఎమ్మెల్యే కొడుకుపై పకడ్భందీగా కేసును నమోదు చేశారు. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఇటీవల తాగిన మైకంలో బీఎండబ్లూ కారు నడిపి ముగ్గురు అమాయకుల ప్రాణాలను బలిగొన్న ఎమ్మెల్యే నందకిషోర్ మహారియా కుమారుడు సిద్ధార్థ్ మహారియా చుట్టూ పోలీసులు ఉచ్చు భిగించారు. ఓ ఆటోను బీఎండబ్యూ కారు ఢీకొన్నప్పుడు తన కుమారుడు కారును నడపడం లేదని, డ్రైవర్ నడిపాడని చెప్పారు

ఇక మీడియా సహా పలువురు ప్రతిపక్షాలు అరోపిస్తున్నట్లు తన కుమారుడికి మద్యం తాగే అలవాటే లేదని, పాలు తప్ప, మరోటి తాగడని, యాక్సిడెంట్ అయిన రాత్రి ఎదురుగా వచ్చిన ఆటోకు అసలు లైట్లు లేవంటూ తన కొడుకును రక్షించుకునేందుకు ఎమ్మెల్యే వేసిన ఎత్తులన్నీ పోలీసుల ముందు చిత్తయ్యాయి. యాక్సిడెంట్ జరిగిన రోజున యాక్సిడెంట్‌కు ముందు సిద్ధార్థ్ మారియా ఓ బార్‌కు, రెండు హోటళ్లుకు వెళ్లాడని, వాటిల్లో మద్యం సేవించాడని ఆ బార్‌ను, హోటళ్ల నుంచి సేకరించిన సీసీటీవీ ఫుటేజుల్లో స్పష్టమైంది. ముఖ్యంగా ఓ బార్‌లో కూర్చొని స్పానిష్ వైన్ సేవించినట్లు ఫుటేజ్‌లో తేలింది. కొసేకా బ్రాండ్‌కు చెందిన వైన్ సేవించినట్లు కూడా సీసీటీవీల్లో రికార్డయింది.

అంతేకాదు మద్యం సేవించిన అనంతరం కారును సిద్ధార్థే నడపడం, ప్రమాదం అనంతరం కారులోని డ్రైవర్ సీటు నుంచి సిద్ధార్థ దిగడం కూడా వీధుల్లోని సీసీటీవీ కెమేరాలు బయటపెట్టాయి. సీసీటీవీ ఫుటేజ్‌లతోపాటు బార్, హోటళ్లలో సిద్ధార్థ చెల్లించిన బిల్లులు అక్కడి సిసిటీవీ ఫూటేజ్ లను కూడా జైపూర్ పోలీసులు సేకరించి సిద్ధార్థపై పగడ్బందిగా కేసును నమోదు చేశారు. యాక్సిడెంట్ అయినప్పుడు ఆటో హెడ్‌లైట్లు లేకుండా దూసుకొచ్చింది అంటూ ఎమ్మెల్యే చేసిన వాదన కూడా వీగిపోయింది. పోలీసు దర్యాప్తులో ఆటో హెడ్‌లైట్లు పనిచేస్తున్నట్లు వెల్లడైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BJP MLA  Nand Kishor  Siddharth  CCTV Footage  BMW Accidentta  

Other Articles