Russian 'bahu' on dharna against Indian 'saas' for property share

Russian bahu stages protest outside her in laws house in agra

Bahu, Olga Efimenkova, in-laws, Agra, consume liquor, Protest, Russian bahu

Olga Efimenkova, a Russian bahu, has been sitting at the door-step of her in-laws as a sign of protest in Indrapuri locality of Agra

స్వదేశీ అత్తారింటి ఎదుట విదేశీ కోడలు దీక్ష..!

Posted: 07/10/2016 09:05 AM IST
Russian bahu stages protest outside her in laws house in agra

మనవాళ్లు విదేశాలలో ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాలో స్థిరపడిన భారతీయులకు వారి కూతుళ్లను ఇచ్చి.. వారు సుఖంగా వుంటారని భావిస్తుంటారు. అయితే భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు బాహుచక్కగా వున్నాయని భావించి ఇక్కడికి తమ ఇంటి లక్ష్మీని ఇచ్చేందుకు విదేశాలలోని అనేక మంది అసక్తిని కనబరుస్తున్నారు. అయితే ఈ క్రమంలో మన సంస్కృతిలో భాగమైన అత్తా కోడళ్ల తగవులు.. విదేశాల్లో మన పరువు తీస్తున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. అయితే విదేశాలకు చెందిన కోడళ్లు కూడా తమ అత్తారింటి పరువు తీస్తున్నారన్న వార్తులు కూడా గుప్పమంటున్నాయి.

టెలీకమ్యూనికేషన్ రంగంలో రాజీవ్ గాంధీ తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పులతో ప్రపంచమే చిన్నదైంది. దీనికి తోడు సోషల్ మీడియా పుణ్యమా అని దేశ విదేశాలకు చెందిన వారి మధ్య పరిచయాలు ఏర్పడటం, ప్రేమగా మారడం.. ఆ తరువాత పరిణయాలు జరగడం అన్ని దేశాల మధ్య సర్వసాధరణంగా జరుగుతుంది. అయితే ఇది కూడా అలాగో జరిగిందో.. లేక మరోలా జరిగిందో తెలియదు కానీ.. ఉత్తరప్రదేశ్లోని అగ్రాలో ఓ యువకుడికి రష్యాకు చెందిన అమ్మాయి కోడలైంది. అయితే అమె తాజాగా తన అత్తారింటి ముందు నిరసన మొదలుపెట్టింది.

తనకు న్యాయం చేయాల్సిందేనంటూ తన చంటిబిడ్డను ఒళ్లో కూర్చొని దీక్షకు పూనింది. అదెదో తెలుగు సినిమాలో యమున తన బిడ్డను ఒడిలో కూర్చొబెట్టుకుని భర్తను సాధించేవరకు చేసిన పోరాటంలాగే ఓల్గా ఎఫిమెంకోవా అనే మహిళ తన అత్తమామల ఇంటి ముందు దీక్షకు కూర్చొంది. ఇంట్లో వద్దంటూ తన అత్తమామలు కొట్టి బయటకు గెంటేయడంతో తాను ఇంటిముందు దీక్షకు దిగానని, తనకు అదే ఇంట్లో ఉండేందుకు అవకాశం ఇచ్చేవరకు తాను ఏమి తినబోనని చెప్పింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇది కుటుంబ వ్యవహారం అయినందున ఎలాంటి ఫిర్యాదు నమోదుచేసుకోలేదని చెప్పింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : agra  hunger strike  Russian daughter-in-law  saas-bahu  uttar pradesh  

Other Articles