ఇక 44 భాషల్లో ఫేస్ బుక్! | Facebook introduce translate tool for posts into 44 languages

Facebook introduce translate tool for posts into 44 languages

Facebook translate tool, FB tool for 44 languages, 44 languages for FB

Facebook introduce translate tool for posts into 44 languages

ఇక 44 భాషల్లో ఫేస్ బుక్!

Posted: 07/02/2016 03:11 PM IST
Facebook introduce translate tool for posts into 44 languages

ప్రస్తుతం విశ్వవ్యాప్తంగా 1.5 బిలియన్ ప్రజలు ఫేస్ బుక్ ను వాడుతున్నారు. అయితే అందులో సగం మాత్రమే ఇంగ్లీష్ భాషపై పూర్తి ఉన్నవారంట. మరి మిగతా వారు? ఎలాగోలా ఫేస్ బుక్ ను నెట్టుకుంటూ వస్తున్నారంట. దీంతో మరి ఎక్కువ సంఖ్యలో యూజర్ల కష్టాలను గుర్తించిన ఫేస్ బుక్ త్వరలో ఓ కొత్త ఫీచర్ ను తేబోతుంది.

తాము కోరుకున్న భాషలో పోస్టులు చేయలనుకుంటున్న వారికోసం త్వరలో ఓ కొత్త టూల్ ను ప్రవేశపెట్టనుంది. పోస్ట్ ను టైప్ చేసి మీరు మీకావాల్సిన భాషను టూల్ పై క్లిక్ చేయగానే అది దానికదే మారిపోతుంది. భాష విషయంలో నెలకొనే సమస్యల నుంచి అధిగమించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫేస్ బుక్ యాజమాన్యం ప్రకటించింది. పోస్టులు చేయటమే కాదు, తమకు కావాలనుకునే భాషలో వాటిని చదువుకునే వెసులు బాటు కూడా ఇందులో కల్పించారు.

ఈ టూల్ యూజర్లకు ముఖ్యంగా రచయితలకు బాగా ఉపకరిస్తుందని పేర్కొంది. అకౌంట్ సెట్టింగ్స్ లోనే స్థానికత బట్టి యూజర్లు ఏ భాషను పోస్టులకు వినియోగించదల్చుకుంటున్నారో ఫేస్ బుక్ గుర్తింస్తుందట. త్వరలోనే ఈ టూల్ సాధారణ వినియోగదారులందరికీ అందుబాటులోకి రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : facebook  44 languages  language tool  

Other Articles