టెక్కీ స్వాతి హంతకుడు రామ్ కథేంటి? | Swathi murder Ram Kumar arrested

Swathi murder ram kumar arrested

Infosys techie Swathi murder, Ram Kumar in Swathi Murder case, Why Ram Killed Swathi, ram kumar arrested in Tirunelveli

Infosys techie Swathi murderer Ram Kumar arrested.

టెక్కీ స్వాతి హంతకుడు రామ్ కథేంటి?

Posted: 07/02/2016 10:58 AM IST
Swathi murder ram kumar arrested

సంచలనం సృష్టించిన ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి హత్య కేసులో నిందితుడిని ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. తిరునల్వేలి లో స్వాతి ఇంటి సమీపంలోనే ఓ హస్టల్ లో ఉంటున్న రామ్ కుమార్ (22) ను శుక్రవారం రాత్రి అరెస్ట్ చేశారు. అయితే పోలీసులను చూడగానే రామ్ కుమార్ బ్లేడ్ తో గొంతుకోసుకున ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది.

చెన్నై మీనాక్షి పురంకు చెందిన రామ్ తిరునల్వేలి లోనే ఇంజనీరింగ్ పూర్తి చేసి ప్రస్తుతం ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. ఈ క్రమంలో ఫోటో ఆధారంగా స్వాతి కేసులో ప్రమేయం ఉన్నట్లుగా పోలీసులు అనుమానించడం, అతన్ని పట్టుకునేందుకు వెళ్లగానే సూసైడ్ ప్రయత్నం చేయటంతో నిందితుడిగా దాదాపు నిర్ధారణ చేసుకున్నారు. ప్రస్తుతం అతను ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి ఏమంత ప్రమాదకరంగా లేదని వైద్యులు తెలిపారు. పోలీసు ప్రత్యేక బృందం అతన్ని విచారించేందుకు సిద్ధంగా ఉంది. విచారణలో అసలు విషయాలు ఏంటో వెలుగు చూసే ఆస్కారం ఉందని చెన్నై కమిషనర్ టీకే రాజేంద్రన్ తెలిపారు.

వారం క్రితం నుంగంబాకం స్టేషన్ నుంచి ఆఫీస్ కు వెళ్తున్న స్వాతిపై రామ్ కిరాతంగా దాడి చేసి హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఆలసత్వం ప్రదర్శించడం, హైకోర్టు అక్షింతలు వేయటంతో నిందితుడి కోసం సుమారు వందల సంఖ్యలో పోలీసులు విచారణలో పాల్గొన్నారు. ఈ మధ్య కాలంలో కొనసాగిన అతిపెద్ద గాలింపు చర్యగా దీనిని పేర్కొన్నారు కూడా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Infosys techie  swathi  Ram kumar  Nungambakkam  Tirunelveli  

Other Articles