Sanford Mayor Jeff Triplett robbed at gunpoint, carjacked

Sanford mayor carjacked at gunpoint

Sanford mayor, Jeff Triplett, gunpoint, carjack, armed robbery, Damarcus Paige, Jermine Horne, Chapman Avenue, Mercedes-Benz

Sanford Police have arrested two suspects in the armed robbery and carjacking of Sanford Mayor Jeff Triplett. who have been identified as Damarcus Paige, 17, and Jermine Horne, 18.

అమెరికాలో కలకలం.. శాన్ఫోర్డ్ మేయర్ కు చేదు అనుభవం.

Posted: 06/28/2016 07:57 AM IST
Sanford mayor carjacked at gunpoint

అమెరికాలో కొత్త తరహా దోపిడి కలకలం రేపుతుంది. అయితే ఈ దోపిడి ఏదో సర్వసాధరణమైన ప్రజానికంలో ఒకరితో జరిగితే పర్వాలేదని సరిపెట్టుకోవచ్చు. కానీ ఏకంగా అగ్రరాజ్యంలోని ఓ ప్రముఖ నగరానికి మేయర్ గా వున్న వ్యక్తితో జరగడమే కలకలం రేగడానికి కారణమైయ్యింది. నగర మేయర్నే బెదిరించి దుండగులు అయన కారు ఎత్తుకు పోయిన ఘటన అమెరికాలోని శాన్ఫోర్డ్ నగరంలో జరిగిడంతో. స్థానికులు ఈ ఘటనపై అందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా మేయర్ కారునే ఎత్తుకెళ్లిన దుండగుల కోసం పోలీసులు రంగంలోకి దిగారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వేకువ జామున తన స్నేహితుడి ఇంటికి వెళ్లందుకు సిద్దమై తన ఇంటి ముందు నిలుచున్న శాన్ఫోర్డ్ నగర్ మేయర్ జెఫ్ ట్రిప్లెట్ ఈ దారుణ అనుభవం ఎదురైంది. ఆయన వద్దకు ముగ్గురు అగంతకులు వచ్చారు. వచ్చి రావడంతోనే వారిలో ఇద్దరు తుపాకీని మేయర్ కు గురిపెట్టి బెదిరించారు. ఈ హఠాత్పరిణామంతో షాక్ కు గురైన మేయర్ తేరుకునే లోపు మరొక అగంతకుడు కారు తాళాలు తీసుకున్నాడు. తర్వాత ముగ్గురు కలిసి మేయర్ మెర్సిడెజ్ బెంజ్ కారులో అక్కడి నుంచి పరారయ్యారు.

మేయర్ జెఫ్ ట్రిప్లెట్ పిర్యాదుతో ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు సాగించిన పోలీసులు జెర్మైన్ జాక్వెస్(18)తో పాటు డమార్కస్ ఫైజ్ (17) ఏళ్ల వయసున్న మైనర్ బాలుడిని అరెస్ట్ చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. నిందితులపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నగరానికి ప్రథమ పౌరుడినైన తన కారునే దొంగిలించడం పట్ల జెఫ్ ట్రిప్లెట్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పోలీసులను ఆదేశించారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sanford mayor  Jeff Triplett  gunpoint  carjack  armed robbery  Damarcus Paige  Jermine Horne  

Other Articles