17-year-old girl hit by train while using smartphone on platform

Japanese girl hit by moving train while using smartphone

Japan,japanese trains,Kugenumakaigan Station,Odakyo Electric Railway, Kugenumakaigan Station, Fujisawa, Odakyo Electric Railway, Sankei Shimbun, smartphone addiction, Smartphones, television,video games

A 17-year-old Japanese girl was hit and injured by a moving train while walking along the edges of the station platform, fully engrossed in her smartphone

స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో మునిగింది.. మృత్యు కౌగిలి..

Posted: 06/27/2016 01:30 PM IST
Japanese girl hit by moving train while using smartphone

చుట్టూపక్కల చూడరా చిన్నవాడా చుక్కలొ చూపు చిక్కుకున్నవాడా కళ్ళముందు కటికనిజం కానలేని గుడ్డిజపం సాధించదు ఏ పరమార్ధం బ్రతుకుని కానీయకు వ్యర్దం.. అంటూ తెలుగు కవులు చెబుతున్న వినిపించుకోదు నేటి తరం. అంతెందుకు రైల్వే స్టేషన్ల వద్ద, ట్రాక్ దాటుతున్న సమయాల్లో కూడా ఫోన్ వాడకూడదు, బస్టాండ్లలోనూ, వాహనాలు నడిపే సమయంలోనూ ఈ నిబంధనను పాటించాలని అధికారులు ఎంతగా జాగృతం చేసినా కుర్రకారులో వున్న యవ్వనత్వం వినిపించుకోదు.

అంతేకాదు.. మాకు తెలుసు ఎలా జాగ్రత్తపడాలో.. మేం అన్ని చూసుకునే చేస్తున్నాం.. ఇంకోదరైతే మాకు కళ్లు లేవా..? మీరు చెప్పాలా..? అంటూ ఎదురు ప్రశ్నిస్తారు మరి. అయితే ఇలా చేసిన ఓ అమ్మాయికి మాత్రం అనుభవ పూర్వకంగా చెప్పిన మాట వినకుంటే ఏం జరుగుతుందో తెలిపివచ్చింది. మృత్యువు కౌగిలి చెంతకు వెళ్లి మరీ తిరిగి వచ్చింది. ఇక ఇప్పుడు అమెకు ఎవరు ఏ హితోక్తి చెప్పినా.. చెవులకెక్కుతుంది.. అందుకే పెద్దలన్నారు.. చెప్పినా వినకపోతే.. అనుభవపూర్వకంగా తెలుసుకోవాల్సిందేనని.

ఇక్కడ కూడా సరిగ్గా అలాగే జరిగింది. స్మార్ట్ ఫోన్ చూస్తూ, దాంట్లో లీనమైపోయి పరిసరాలను మరిచిపోయిన ఓ అమ్మాయి పెద్ద ప్రమాదంలో పడింది. అదృష్టవశాత్తూ కొద్దిలో ప్రాణాలతో బయటపడింది. జపాన్లో ఈ సంఘటన జరిగింది. ఫుజిసవాలో కుగెనుమకైగన్ రైల్వే స్టేషన్లో 17 ఏళ్ల అమ్మాయి స్మార్ట్ ఫోన్ చూస్తూ ప్లాట్ఫామ్పై నడుచుకుంటూ వెళ్తోంది. అటుగా రైలు వస్తున్నా పట్టించుకోకుండా ప్లాట్ఫామ్ చివరగా ట్రాక్ దగ్గరకు వెళ్లింది. రైలు వెంట్రుకవాసిలో ఆమె తలను ఢీకొట్టింది. రైలు నెమ్మదిగా రావడం, ఆమె ట్రాక్పై పడకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడింది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles