Hillary Clinton Holds 5-Point Lead Over Donald Trump, Latest Poll Finds

Hillary clinton leads donald trump by 5 points

bernie sanders,democratic party,donald trump,election 2016,gary johnson,green party,hillary clinton,jill stein,libertarian party,presidential election,presumptive democratic presidential nominee,presumptive republican presidential nominee,republican party,third-party candidates,wall street journal,nbc news poll,Donald Trump,political,general news,politics,international relations,domestic politics,elections,national,presidential elections,surveys,polls

Democrat Hillary Clinton’s lead over Republican rival Donald Trump stands at five percentage points, according to a new Wall Street Journal/NBC News poll

ఒబామా నుంచి పదవీ బాధ్యతలు అందుకోనున్న హిల్లరీ..?

Posted: 06/27/2016 12:48 PM IST
Hillary clinton leads donald trump by 5 points

అగ్రరాజ్యం అమెరికా 131 ఏళ్ల చరిత్రను తిరగరాస్తూ ఒక మహిళ అధ్యక్షురాలిగా పదవీ బాధ్యతలను చేపట్టనుందా..? ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామా నుంచి అమెరికా అధ్యక్షురాలిగా హిల్లరీ క్లింటన్ పదవీ బాధ్యతలను అందుకోనుందా..? అమెరికా చరిత్రలో క్లింటన్ రెండు దఫాలుగా అమెరికా అధ్యక్షుడిగా చేయగా, పస్ట్ లేడీగా వున్న అమె అ తరువాత కేవలం పదేళ్లలో అధ్యక్షరాలి స్తాయికి ఎదిగి.. రిపబ్లికన్ పారటీ అభ్యర్థి, ప్రముఖ వాణిజ్యవేత్త డోనాల్డ్ ట్రంప్ కు చుక్కలు చూపిస్తూ.. పగ్గాలు చేపట్టనుందా..? అంటే అవుననే సమాధానాలే అధికంగా వినబడుతున్నాయి.

అమెరికా అధ్యక్ష పదవికి ఎవరెవరు పోటీ పడతారో తెలిసిపోయింది. నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో తన సహజ నైజాన్ని చాటుకుంటూ ముందుగా అంచనాలను తారుమారు చేసి రేసులో ముందుకు దూసుకెళ్లిన రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్.. ఆ తరువాత తొలిసారిగా అమెరికా చరిత్రలో తనకంటూ ఒక నూతన అధ్యయాన్ని రచించుకుంటూ అగ్రరాజ్య ఉన్నత పదవికి బరిలో నిలిచిన మహిళ హిల్లరీ క్లింటన్. ఇక ఇద్దరిలో ఎవరిది పైచేయి అనే విషయం తేలేందుకు మాత్రం మరికోన్ని నెలలు అగాల్సిందే.

అయితే ఫలితాలు ఎలా వుండబోతున్నాయి అని  నిర్ణయించడానికి చేసిన సర్వేలలో.. డోనాల్డ్ ‍ట్రంప్ కంటే హిల్లరీ క్లింటన్దే పైచేయి అని తేలింది. వాషింగ్టన్ పోస్ట్ - ఏబీసీ న్యూస్ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో డెమొక్రాట్ అభ్యర్థి హిల్లరీకి.. రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ కంటే 12 పాయింట్ల ఆధిక్యం కనపడింది. ఈరోజుకు ఈరోజే అధ్యక్ష ఎన్నికలు నిర్వహిస్తే.. తాము హిల్లరీకి ఓటేస్తామని 51 శాతం మంది చెప్పగా, ట్రంప్ తరఫున ఉన్నవాళ్లు 39 శాతం మందేనని తేలింది.

ఇక వాల్స్ట్రీట్ జర్నల్ - ఎన్బీసీ న్యూస్ నిర్వహించిన పోల్లో ఇంత ఎక్కువ తేడా లేకపోయినా, అక్కడ కూడా హిల్లరీ క్లింటన్కే ఆధిక్యం దక్కింది. హిల్లరీకి 46 శాతం, ట్రంప్కు 41 శాతం మంది మద‍్దతు కనిపించింది. ఇదే పరిస్థితి చివరి వరకు కొనసాగితే మాత్రం.. వివాదాస్పద వ్యాఖ్యలతో అంతర్జాతీయంగా అందరి దృష్టిని ఆకర్షించిన డోనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ లోకి వెళ్లడం కష్టమేనని విశ్లేషకులు అంటున్నారు. ఇటీవలే ఆయన తన పార్టీ ప్రచార మేనేజర్ను కూడా తొలగించారు. నిధుల సేకరణలో కూడా ట్రంప్ కంటే హిల్లరీ చాలా ముందున్నారు.

ఆర్లాండోలోని గే నైట్ క్లబ్బులో కాల్పులు జరిగిన తర్వాత కాల్పులు జరిపిన వ్యక్తిని అభినందిస్తూ ట్రంప్ ట్వీట్ చేయడం కూడా పలువురికి అసంతృప్తి కలిగించింది. ముస్లింలు అమెరికాలోకి రాకుండా అడ్డుకోవాలని కూడా ట్రంప్ పదేపదే చెబుతున్నారు. ట్రంప్ ఇలాంటి తప్పులు చాలా చేశారని, గత కొన్నివారాలుగా ఇలా చేయడం వల్లే వెనకబడ్డారని రిపబ్లికన్ పార్టీ నాయకుడు మిచ్ మెక్ కానెల్ అన్నారు. అయితే ఇంకా నవంబర్ వరకు చాలా సమయం ఉందని, అప్పటికి పరిస్థితులు మారొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : us presidential polls  hillary clinton  donald trump  pre poll surveys  

Other Articles