‘చచ్చిన’ మహిళా పంచాయితీ ఎన్నికల్లో గెలిచింది | Dead woman won bihar panchayath elections

Dead woman won bihar panchayath elections

Dead woman won elections, bihar panchayath elections, Murderer husband in panchayath elections, చచ్చిన మహిళ పంచాయితీ ఎన్నికల్లో గెలుపు, తాజా వార్తలు, జాతీయ వార్తలు, national news, bihar dead woman won in elections, Bihar’s Sitamarhi district, Tikauli panchayat, bihar panchayath elections cheating

Dead woman won bihar panchayath elections. Murderer husband try to cheat police.

‘చచ్చిన’ మహిళా పంచాయితీ ఎన్నికల్లో గెలిచింది

Posted: 06/25/2016 01:17 PM IST
Dead woman won bihar panchayath elections

దాదాపు పదేళ్ల క్రితం చనిపోయిన ఓ మహిళ ఇప్పుడు జరిగిన పంచాయితీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించింది. తిరిగి బ్రతికొచ్చి కాదు సమాధిలో ఉండే. నిజంగా ఇది పచ్చి నిజం... ఏంటీ విడ్డూరం అనుకుంటున్నారా? అయితే బీహార్ లోని సీతామర్హి కి వెళ్దాం పదండి....

జిల్లాలోని తికౌలి గ్రామంలో మిథిలేష్ దేవీ అనే మహిళ తొమ్మిదేళ్ల క్రితం భర్త చేతిలో దారుణంగా హత్యకు గురైంది. అయితే తాజాగా ఆ గ్రామానికి జరిగిన పంచాయితీ బోర్డుకు జరిగిన ఎన్నికల్లో ఆమె సమితి సభ్యురాలిగా ఎంపికైంది. ఈ విషయాన్ని అధికారులు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు కూడా. కానీ, ఆమె హత్యకు గురైనట్లు తెలుసుకున్న అధికారులు, ఎన్నికల్లో ఎలా గెలిచిందబ్బా అని షాక్ కి గురయ్యారు. లోతుగా తవ్వితే మరో ఇంటస్ట్రింగ్ ట్విస్ట్ బయటపడింది.

ఆమె భర్త సికిందర్ హత్య చేశాక పరారయ్యాడు. పోలీసులకు భయపడి దేశాలు పట్టుకు తిరిగిన అతగాడు గుడియా దేవిని రెండో పెళ్లి కూడా చేసుకున్నాడు. ఇప్పుడు ఆ రెండో భార్యతోనే మిథిలేష్ గా నామినేష్ వేయించి గెలిపించాడు. తద్వారా పెళ్లానికి అధికారం చేజిక్కించడంతోపాటు, తాను కేసు నుంచి బయట పడొచ్చనే డబుల్ ప్లాన్ వేశాడు. చివరకు గుట్టు రట్టుకావటంతో ఈ కేసును ప్రత్యేకంగా విచారించాలని జిల్లా జడ్జి ఆదేశించారు.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles