actor caught in drunk and drive police check in jubliee hills

Another actor caught in police drunk and drive raid

tv actor, drunk and drive, bharani, jubilee hills police, prashasan nagar, actors, bharani shanker, court, barani shanker car siezed, bharani shanker arrested

Even after many of the actors being caught in drunk and drive cases, others are not learning any thing from it, yet another actor caught in police drunk and drive raid in jubliee hills

డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ మరో నటుడు

Posted: 06/25/2016 07:02 AM IST
Another actor caught in police drunk and drive raid

మద్యం సేవించి నిబంధనలకు విరుద్ధంగా కారు నడుపుతూ బుల్లితెర నటుడు భరణి శంకర్ అడ్డంగా దొరికిపోయాడు. నిన్న రాత్రి హైదరాబాదు జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్ ప్రాంతంలో పోలీసులు ముమ్మరంగా డ్రంకన్ డ్రైవ్ సోదాలు జరగ్గా... పెద్ద సంఖ్యలో వాహనాలను ఆపిన పోలీసులు ఆయా వాహనాల డ్రైవింగ్ సీట్లలోని వ్యక్తులను పరీక్షించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్న పలువురిని అదుపులోకి తీసుకుని వారి వాహనాలను సీజ్ చేశారు. వారందరినీ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

అయితే పోలీసుల తనిఖీల సందర్భంగా అటుగా వచ్చిన సినీ, టీవీ నటుడు భరణి శంకర్ కారును ఆపిన పోలీసులు డ్రైవింగ్ సీట్లోని అతడికి బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో అతడు 41 శాతానికి పైగా మద్యం సేవించినట్లు తేలింది. మద్యం సేవించి వాహనం నడుపుతున్నట్లుపోలీసులు తెలిపారు. భరణి కారును సీజ్ చేసిన పోలీసులు కేసు నమోదు చేశారు. పలు సీరియల్స్లో నటించిన భరణి కొన్ని సినమాల్లో సైతం నటించాడు. సోమవారం అతడిని కోర్టులో హాజరుపరచనున్నట్లు ఈ సందర్భంగా పోలీసులు చెప్పారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tv actor  drunk and drive  bharani  jubilee hills police  prashasan nagar  actors  bharani shanker  

Other Articles