Woman bludgeons former servant to death in full public view

Woman bludgeons former servant to death

coimbatore murder, coimbatore maid murder, maid bludgeoned to death, house servant, house help, house maid, revenge murder, coimbatore, beaten to death, sugandhamani, house maid, avenge, husband's murder, wife

A 40-year-old woman today allegedly murdered a man at a bus stand here in full public view, avenging her husband's murder by him, police said.

ITEMVIDEOS: భర్త హంతకుడిపై అలా ప్రతీకారం తీర్చుకున్న భార్య..

Posted: 06/24/2016 08:57 PM IST
Woman bludgeons former servant to death

తన భర్తను చంపిన హంతకుడిపై ఓ సాధారణ గృహిణి ప్రతికారం తీర్చుకుంది. తన భర్తను చంపడమే కాకుండా ఆ కేసును ఉపసంహరించుకోమని బెదిరింపులకు పాల్పడిన హంతకుడిని నట్టనడి వీధిలో మట్టుబెట్టింది. తన భర్తను హంతకుడి ఎలా హతమార్చాడో అచ్చంగా అలానే అమె హంతకుడిపై దాడికి తెగబడి హతమార్చింది. తన భర్తను చంపిన హంతకుడిని అందరూ చూస్తుండగానే, బస్టాండ్లో చంపి ప్రతీకారం తీర్చుకుంది. ఆ తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయింది. ఈ ఘటన తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగింది. ఈ ఘటనతో స్థానికులు భీతిల్లిపోగా, కొందరు మాత్రం అమె చర్యను సమర్ధించారు.

వివరాల్లోకి వెళ్తే.. రంగస్వామి, సుగంధమణి దంపతుల ఇంట్లో రవికుమార్ (50) అనే అతను పనిచేస్తుండేవాడు. ఏడాదిన్నర క్రితం రవికుమార్ గొడవపడి రంగస్వామిని బండరాయితో మోది చంపాడు. ఇటీవల బెయిల్పై వచ్చిన రవికుమార్ గురువారం రాత్రి సుగంధమణి ఇంటికి వెళ్లి కేసు విషయంపై బెదిరించాడు. కేసును ఉపసంహరించుకోని పక్షంలో రంగస్వామికి పట్టిన గతే కుటుంబంలోని మిగతావారికి పడుతుందని బెదిరించాడు. అంతే ఆ రాత్రంతా దీర్ఘంగా అలోచించిన సుగంధమణి.. ఇవాళ హంతకుడిని మట్టుబెట్టాలని నిర్ణయించుకుంది.

కోయంబత్తూరులోని ఓ బస్టాండ్ వద్ద ఉన్న రవికుమార్ వద్దకు వెళ్లిన సుగంధమణి అతనిపై పెద్ద రాయితో దాడి చేసింది. అంతే ఒక్కసారిగా తగిలిన దెబ్బతో హంతకుడి అక్కడే పడిపోయాడు. అయినా అతనిలో ఇంకా జీవం ఉందని భావించిన సుగంధమణి.. అతనిపై పలుమార్లు బండరాయితో బాదడంతో అక్కడికక్కడే చనిపోయాడు. ఆ తర్వాత ఆమె బస్సులో వెళ్లి స్థానిక పోలీస్ స్టేషన్లో లొంగిపోయింది. పోలీసులు ఆమెను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : coimbatore  sugandhamani  house maid  avenge  husband's murder  wife  

Other Articles