అంతా చూస్తుండగా మహిళా టెక్కీపై దారుణం | techie brutually hacked at Nungambakkam railway station

Techie brutually hacked at nungambakkam railway station

Infosys swathi, Infosys woman employee murdered, Infosys woman employee hacked, Infosys swathi railway station, Infosys swathi murder, Infosys swathi killed at railway station, ఇన్ఫోసిస్ స్వాతి, స్టేషన్లో మహిళపై ఘాతుకం, రైల్వే స్టేషన్లో టెక్కీ హత్య, స్వాతి హత్య

In a gruesome incident, a young Infosys woman employee was hacked to death at Nungambakkam railway station.. The victim has been identified as S. Swathi (24), a resident of South Gangai Amman Koil Street, Choolaimedu in Chennai. She was unmarried.

ITEMVIDEOS:అంతా చూస్తుండగా మహిళా టెక్కీపై దారుణం

Posted: 06/24/2016 03:40 PM IST
Techie brutually hacked at nungambakkam railway station

ఎప్పటిలాగే అమ్మకు బై చెప్పి ఆఫీసుకు వెళ్తున్న ఆ యువతికి అదే ఆఖరి రోజు అవుతుందని బహుశా అనుకుని ఉండదు. అందరూ చూస్తుండగానే బిజీ రైల్వే స్టేషన్ లో ఆమెపై ఘోరం జరిగింది. చుట్టూ జనాలు ఉన్నప్పటికీ ఎవరూ కూడా అతన్ని నిలువరించే ప్రయత్నం చేయలేదు. తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెను నరికి చంపాడు. తమిళనాడులోని నుంగంబాకం రైల్వేస్టేషన్లో శుక్రవారం చోటుచేసుకున్న ఈ ఘటనలోకి వెళితే...

దక్షిణ గంగై వీధిలో నివసించే స్వాతి (24) ఇన్ఫోసిస్ లో పని చేస్తోంది. ఎప్పటిలాగే తండ్రి శ్రీనివాసన్ శుక్రవారం కూడా ఆమెను నుంగబాకం రైల్వేస్టేషన్ వద్ద దించి వెళ్లాడు. కాసేపట్లో రైలు వస్తుందనగా ఆమె ప్లాట్ఫాం మీద నిల్చుంది. ఇంతలో ఓ యువకుడు ఆమె సమీపంలోకి వచ్చి తనతో తెచ్చుకున్న కోడవలితో ఆమెపై దాడి చేశాడు. అంతే కొద్ది క్షణాల్లోనే ఆమె రక్తపుమడుగులో పడి చనిపోయింది. అక్కడ సీసీ కెమెరా లేకపోవటంతో పోలీసులు ప్రత్యక్ష సాక్ష్యలను విచారించారు.



నల్ల ప్యాంటు వేసుకున్న ఆ యువకుడికి, స్వాతికి మధ్య కాసేపు తీవ్ర వాగ్వాదం జరిగిందని, కోపోద్రిక్తుడైన అతను తన బ్యాగులోంచి కోడవలి తీసి ఆమెను పాశవికంగా నరికాడని వారు చెబుతున్నారు. కొన్నాళ్ల క్రితం ఆమెకు, ఓ క్యాబ్ డ్రైవర్తో గొడవ అయ్యిందట. దీంతో అతనే ఈ పని చేశాడా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. మరోవైపు ప్రేమ కోణం కూడా ఉండి ఉండొచ్చని పోలీసులు చెబుతున్నారు. ఘటన జరిగే సమయంలో స్టేషన్లో వందల మంది ఉండి కూడా ఏ ఒక్కరు అతన్ని ఆపే ప్రయత్నం చేయకపోవటం గమనార్హం.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Infosys  swathi  killed  hacked  Nungambakkam railway station  chennai  

Other Articles