బ్యూటీ క్వీన్ సైడ్ బిజినెస్ తెలిస్తే షాకవుతారు | Darshitmita Gowda arrested in drug rocket

Darshitmita gowda arrested in drug rocket

Darshitmita Gowda, top model in drug scandal, Bengaluru top model scandal, Bengaluru top model in drug mafia, డ్రగ్ మాఫియాలో బ్యూటీ క్వీన్, తాజా వార్తలు, డ్రగ్ ముఠాతో టాప్ మోడల్, టాప్ మోడల్ సైడ్ బిజినెస్, తెలుగు వార్తలు

miss queen karnataka 2014 Darshitmita Gowda linked with drug rocket and arrested.

ITEMVIDEOS:బ్యూటీ క్వీన్ సైడ్ బిజినెస్ తెలిస్తే షాకవుతారు

Posted: 06/24/2016 11:50 AM IST
Darshitmita gowda arrested in drug rocket

ఆమె ఒక టాప్ మోడల్, కొన్ని సినిమాల్లో కూడా నటించింది. పైగా మిస్ క్వీన్ విజేత కూడా. ర్యాంపుపై వయ్యారాలు ఒలకబోస్తూ అందంతో కట్టిపడేసిన ఈ భామ వెనుక ఉన్న చీకటి కోణం తెలిస్తే ఎవరికైనా దిమ్మతిరగాల్సిందే. అప్పటిదాకా వీఐవీ కేటగిరీలో ఆమెకు భద్రత కలిపించిన పోలీసులు ఆమె చేస్తున్న సైడ్ బిజినెస్ తెలిసి నోళ్లు వెళ్లబెట్టారు.



మిస్ క్వీన్ కర్ణాటక 2014 విజేత దర్శిత్ మిత గౌడ ను బెంగళూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్ రాకెట్ ముఠాతో సంబంధం ఉండటంతోపాటు, సరఫరా చేసిందనే ఆరోపణలు ఆమెపై ఉన్నాయి. బెంగళూర్, గోవా, మంగళూర్ నగరాలకు చెందిన ప్రముఖులకు ఈమె డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు ఆధారాలు లభించాయి. ముఖ్యంగా విద్యార్థులే లక్ష్యంగా ఆమె ఈ పని చేసినట్లు అర్థమౌతోంది.

గత నవంబర్ లో ఆర్టీ నగర్ లో ఆమె నివసిస్తున్న అపార్ట్ మెంట్ పై దాడి చేసిన నార్కోటిస్ కంట్రోల్ బ్యూర్ అధికారులు పెద్ద మొత్తంలో డ్రగ్స్ ను పట్టుకున్నారు. 26 ఏళ్ల ఈ మోడల్ తన బాయ్ ప్రెండ్ నిషాంత్ సాయంతో ఈ దందాను నిర్వహిస్తోంది. ఈ విషయాన్ని నిషాంత్ కూడా ధృవీకరించడంతో ఈనెల 21న ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు.

 

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Darshitmita Gowda  top model  drug mafia  Narcotics Control Bureau  

Other Articles