ఘోరం: మర్మాంగంలోకి తుపాకీ, కట్టెపుల్లలు... | bihar girl brutally gangraped by local goons

Bihar girl brutally gangraped by local goons

Bihar woman, Bihar Nirbhaya, gun at genital area, gunpoint and rape, మర్మాంగం వద్ద తుపాకీ, తాజా వార్తలు, జాతీయ వార్తలు, బీహార్ నిర్భయ, మర్మాంగంలో తుపాకీ, ఘోరమైన రేప్, తాజా వార్తలు, బీహర్ రేప్, బీహార్ గ్యాంగ్ రేప్

Bihar woman was brutally gangraped by local goons in Motihari at gunpoint. The victim was dragged out of her house last week by a few men and was badly beaten up and raped. The accused brutalised her by inserting a pistol and some wooden object in her genital area. She was rushed to a local hospital in critical condition.

ఘోరం: మర్మాంగంలో గన్, కట్టెపుల్లలు...

Posted: 06/24/2016 10:55 AM IST
Bihar girl brutally gangraped by local goons

నిర్బయ ఘటనలో జరిగిన దారుణం కళ్ల ముందు ఇంకా కదలాడుతూనే ఉంది. చట్టాలు కఠినంగా మారినప్పటికీ మృగాలకు అవేం పట్టడం లేదు. మహిళలపై నిర్మోహమాటంగా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. నాలుగేళ్ల తర్వాత సరిగ్గా అలాంటి తరహాలోనే మరో దారుణమైన ఘటన బీహార్ లోని మోతిహారిలో చోటు చేసుకుంది.

21 ఏళ్ల ఓ యువతిని గన్ తో బెదిరించి గ్యాంగ్ రేప్ కి పాల్పడ్డారు. తుపాకీని, కట్టె పుల్లలను మర్మాంగంలోకి చొప్పించి రాక్షసానందాన్ని పొందారు. తీవ్ర గాయాలతో రోడ్డు పక్కన వివస్త్రగా పడి ఉన్న బాధితురాలిని స్థానికులు గుర్తించి ఆస్పత్రికి తరలించారు.

ఇదే యువతిని ప్రస్తుత నిందితుల్లో ఒకడైన సమీవుల్లా లోగడ లైంగికంగా వేధిస్తూ ఓ వీడియో తీశాడు. దాన్ని చూపించి ఆమెను లొంగదీసుకునేందుకు చాలాసార్లు ప్రయత్నించాడు. ఇతగాడి మృగత్వానికి మరికొందరు జోడీకట్టారు. అందుకు ఒప్పుకోకపోవటంతో ఇంట్లోంచి బలవంతంగా ఆమెను లాకెళ్లారు. దీంతో ఆ యువతి బ్లేడ్ తో ప్రతిఘటించబోయింది. అంతే ఆ ఉన్మాదులు రెచ్చిపోయారు. దారుణంగా సామూహిక అత్యాచారం చేశారు.

చెప్పుకోరాని చోట తనను కొట్టడంతోపాటు, భయంకరంగా అత్యాచారం చేసినట్టు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న బాధితురాలు చెబుతోంది. ఇంకా ఘోరం ఏంటంటే... ఆ నిందితుల కుటుంబ సభ్యులు సైతం తనపై దాడి చేశారంట. అయితే, కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని యువతి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bihar Nirbhaya  gun at genital area  gun and woodensticks  

Other Articles