36 మంది నకిలీ వైద్యుల అరెస్ట్ | 36 fake doctors arrested in Bihar topper scam

36 fake doctors arrested in bihar topper scam

Bihar topper scam in Nepal, బీహార్ లో నకిలీ వైద్యుల అరెస్ట్, 36 మంది నకిలీ వైద్యులు, టాపర్ స్కాంలో కొత్త ట్విస్ట్, టాపర్ స్కాంలో సరికొత్త మలుపు, latest news, bihar toppers scam, 36 fake doctors arrested in Bihar topper scam, తాజా వార్తలు, తెలుగు వార్తలు, latest news, political news

Bihar topper scam has crossed international borders when Nepal Central investigation bureau has arrested arrested 36 Doctors holding forged examination certificates from Bihar. The arrested Doctors were working in various hospitals around Nepal.

ITEMVIDEOS: 36 మంది నకిలీ వైద్యుల అరెస్ట్

Posted: 06/20/2016 02:57 PM IST
36 fake doctors arrested in bihar topper scam

బీహర్ టాపర్స్ స్కాం సరికొత్త మలుపు తిరిగింది. సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (సీబీఐ) విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కుంభకోణం అంతర్జాతీయ సరిహద్దులు దాటేసిందన్న అనుమానాలు నిజమని తేలుతున్నాయి. ఇందుకు సంబంధించి 36 మంది వైద్యులను నేపాల్ లో సీబీఐ అరెస్ట్ చేసింది. వీరంతా బీహార్ నుంచే నకిలీ సర్టిఫికెట్లు పొందినట్లు రుజువైంది.

నేపాల్ లో వీరంతా వేర్వేరు ప్రాంతాల్లో వైద్యులుగా చెలామణి అవుతున్నారు. కాగా, ప్రస్తుతం వీరంతా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. విచారణ కోసం వీరందరిని తమ కస్టడీకి ఇవ్వాలని న్యాయస్థానాన్ని సీబీఐ కోరుతోంది. వీరికి ఫేక్ అకాడమీ సరిఫ్టికెట్లు, ఎలా వచ్చాయి. విద్యాధికారుల హస్తం ఉందా? లేక రాజకీయ కోణం ఉందా? ఇంకా ఏయే దేశాలకు ఇది విస్తరించింది? తదితర అంశాలపై సీబీఐ విచారణ చేపట్టనుంది. ఓ జాతీయ ఛానెల్ బయటపెట్టిన టాపర్ల బాగోతంతో తీగ లాగితే ఇప్పుడు డొంకంతా కదులుతోంది.   

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bihar topper scam  fake doctors  nepal fake doctors  

Other Articles