తన చావును తానే షూట్ చేశాడు | chicago youth murdered in live streaming on Facebook

Chicago youth murdered in live streaming on facebook

Chicago man shot dead in FB live chat, chicago youth murder live, live FB murder, లైవ్ లో హత్య, ఫేస్ బుక్ లైవ్ ఛాట్ లో హత్య, ఫేస్ బుక్ లైవ్ లో హత్య, చికాగో యువకుడి లైవ్ హత్య, లైవ్ చాట్ లో హత్య, వీడియో చాట్ హత్య, latest news, chigaco news, telugu news, taajavarthalu, తెలుగు వార్తలు, తాజా వార్తలు

A 28-year-old man in Chicago, live streaming on Facebook was shot dead live during his broadcast and the video of his death has gone viral. The 14 minute video features the man drinking, hanging out with his friewnds on the sidewalk and complaining about the heat. Firings can then be heard in the background. Six minutes into the video and the victim looks out of frame and says "Boys stop playing."

ITEMVIDEOS: తన చావును తానే షూట్ చేశాడు

Posted: 06/18/2016 02:10 PM IST
Chicago youth murdered in live streaming on facebook

ఏనిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు అన్నట్లు ఆ యువకుడికి తన చావును తానే చిత్రీకరించుకోబోతున్నాడని బహుశా ఊహించి ఉండడేమో.  ఫేస్ బుక్ లో తన స్నేహితులతో సరదాగా లైవ్ వీడియో చాట్ చేస్తుండగా అతనిపై హఠాత్తుగా కాల్పులు జరిగాయి. దీంతో అక్కడిక్కడే కుప్పకూలి మరణించగా, ఆ వీడియో ఇప్పుడు అంతర్జాలంలో సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే...
 
చికాగోకు చెందిన ఆంటానియో పెర్కిన్స్ (28) మెక్ డోనాల్ట్స్ లో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతనికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. గురువారం సాయంత్రం సరదాగా తన స్నేహితులతో లైవ్ స్ట్రీమింగ్ చాట్ చేస్తున్నాడు. అంతలో అక్కడికొచ్చిన ఓ ముఠా అతనిపై కాల్పులకు దిగింది. దీంతో పెర్కిన్స్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఆ సమయంలో అక్కడ నెలకొన్న గందరగోళమంతా వీడియోలో నమోదయ్యింది. బాయ్స్ స్టాప్ ప్లేయింగ్ అంటూ పెర్కిన్స్ గొంతు అందులో స్పష్టంగా రికార్డయ్యింది.   

వెంటనే ఆసుపత్రికి తరలించినా ఫలితంలేకపోయింది. కాల్పుల వెనక ముఠా తగాదాలు ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై పెర్కిన్స్ తండ్రి  డానియల్ కోల్ స్పందిస్తూ... తన కొడుక్కి ఎటువంటి గ్యాంగ్ స్టర్లతో సంబంధంలేదని, అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారని వాపోయాడు. ప్రస్తుతం 6 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోను పరిశీలించడం ద్వారా సాక్ష్యాలు సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు.


భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chicago man  FB live chat  murder in live chat  

Other Articles