actress, former MP vijayashanthi house robbed in hyderabad

Theft in former mp actress house in banjara hills

Actress Vijayashanthi, Former MP Vijayashanthi, Congress leader Vijayashanti, Vijayashanthi house robbed, Theft in Vijayashanthi house, Vijayashanthi house in banjara hills, Vijayashanthi diamond ring

Actress turned Politician, Former MP, Congress leader Vijayashanthi house robbed in hyderabad banjara hills.

కాంగ్రెస్ నేత, సినీ నటి నివాసంలో చోరి

Posted: 06/18/2016 10:22 AM IST
Theft in former mp actress house in banjara hills

తెలంగాణ రాజధాని, 416 ఏళ్ల చరిత్ర కలిగిన హైదరాబాద్ నగరాన్ని నేర రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు పోలీసులు నిత్యం శ్రమిస్తున్నారు. అయినా నేరాలను ప్రవృత్తిగా, వృత్తిగా ఎంచుకున్న నేరగాళ్లు మాత్రం తమ ఉనికి కొత్త పద్దతుల ద్వారా చాటుతూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. ఇప్పటికే నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్, లేట్ నైట్ తిరుగుళ్లు, రాత్రి వేళలు, వీకెండ్స్ లో బైక్ రేస్ లను పూర్తిగా నియంత్రించిన పోలీసులను చైన్ స్నాచర్లు మాత్రం సవాల్ విసరుతున్నారు. వారిని పట్టుకునేందుకు రంగంలోకి మఫ్టీ టీమ్ లను అయుధాలతో దింపినా ఆశించిన ఫలితం రాలేదు.

గత కొన్ని రోజులుగా స్థబ్ధుగా వున్న నగరంలో మళ్లీ చైన్ స్నాచర్లు పంజా విసురుతూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. ఇదే అదనుగా భావించి.. దొంగలు కూడా తమ పనితనాన్ని ప్రదర్శిస్తూన్నారు. తాజాగా సినీ నటి విజయశాంతి నివాసంలో చోరీ జరిగింది. డైమండ్ రింగ్, చెవిదుద్దులుతో పాటు బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. దీంతో విజయశాంతి సోదరుడు ప్రసాద్ శుక్రవారం సాయంత్రం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vijayashanthi  Banjara hills  Telangana police  diamond ring  Theft  crime  

Other Articles