తెలంగాణ ఆర్టీసీని మూసేస్తున్నారా? | KCR fire on RTC officials for strike notice

Kcr fire on rtc officials for strike notice

Telangana CM, KCR, RTC strike, TSRTC loss, telangana news, latest news, తెలంగాణ వార్తలు, తెలుగు వార్తలు, తెలంగాణ ఆర్టీసీ, కేసీఆర్ ఆర్టీసీ అధికారులు, నష్టాల్లో టీ ఆర్టీసీ, తాజా వార్తలు, telugu news

KCR fire on telangana RTC officials for strike notice. says shoutdown RTC for huge losses.The state government will not hesitate to consider the idea of discarding the loss-making Telangana State Road Transport Corporation and terminating the bus services in the government sector, chief minister K Chandrasekhar Rao has warned.

తెలంగాణ ఆర్టీసీని మూసేస్తున్నారా?

Posted: 06/17/2016 11:18 AM IST
Kcr fire on rtc officials for strike notice

అతిపెద్ద రవాణా వ్యవస్థ ఆర్టీసీని మూసేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందా? స్వయానా ముఖ్యమంత్రి కేసీఆర్ నోటి నుంచే ఈ వ్యాఖ్యలు రావటంతో ఇప్పుడు ఈ అంశం పెద్ద చర్చగా మారింది. సమైక్య రాష్ట్రంలో ఉండగా విపరీతంగా లాభాలు అర్జించిన ఆర్టీసీ రెండుగా విడిపోయాక ఇరుచోట్ల నష్టాలతోనే నడుస్తుందన్నది వాస్తవం. ఇది సరిపోదనట్లు ఆ మధ్యే సమ్మె ద్వారా భారీగా లాభాలు అర్జించిన ఉద్యోగులు ఇప్పుడు మరోసారి సమ్మె బాట పట్టనున్నట్లు సంకేతాలు పంపారు. ఈ మేరకు నోటీసు గురించి సీఎం కేసీఆర్ వద్ద ప్రస్తావించగా, ఆయన అధికారులను హెచ్చరించినట్లు తెలుస్తోంది.

అసలు ఆర్టీసీని కొనసాగించడం ఎందుకు? మూసేద్దాం" అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలతో ఆర్టీసీ అధికారులు బిత్తరపోయారంట. అయితే తెలంగాణలో మొత్తం 95 ఆర్టీసీ డిపోలుంటే, అందులో 90 చోట్ల నష్టాలతో నడుస్తున్నట్లు సమాచారం. లాభాల్లోకి తెచ్చే అవకాశాలు ఉన్నా, అధికారుల అలసత్వం కారణంగానే నష్టాలు నమోదవుతున్నాయని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఆర్టీసీ కార్మికులు కోరిన దానికన్నా అధికంగా 44 శాతం ఫిట్ మెంట్ ఇచ్చామని గుర్తు చేసిన ఆయన, అయినా ఉద్యోగుల పనితీరు మెరుగుపడకపోగా, మరోసారి సమ్మె నోటీసులు ఇస్తారా? అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం.

కనీసం సగం డిపోలన్నా లాభాల్లో ఉండాలని, అందుకు కొత్త ఆలోచనలు చేయాలని, అవసరమైతే ప్రయాణికుల ఇళ్ల వరకూ బస్సులు నడపాలని అదికారులతో చెప్పారంట. వాణిజ్య ప్రకటనలపై దృష్టి పెట్టాలని, జాతరలు, పుష్కరాలకు మరిన్ని బస్సులు నడపాలని ఇలా పలు సూచనలు చేశారంట. ఇక ఆర్టీసీ అధికారులు ఉద్యోగుల డిమాండ్లను కేసీఆర్ ముందుంచగా, జీహెచ్ఎంసీ నుంచి కొన్ని నిధులను ఇప్పించేందుకు మాత్రమే హామీ ఇచ్చారని తెలుస్తోంది. తమ గొంతెమ్మ కోర్కెలతో ప్రభుత్వాన్ని మరోసారి ఇబ్బందుల్లోకి నెడదామనుకున్న ఆర్టీసీ అధికారుల నోళ్లను ఆయన లెక్కలతో భలేగా మూయించారు.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana CM  KCR  RTC strike  TSRTC loss  telangana news  

Other Articles