Arrest of Kapu leader Mudragada Padmanabham is political vendetta: Chiranjeevi

Chandrababu bringing differences in kapus alleges chiranjeei

Arrest of Kapu leader Mudragada Padmanabham is political vendetta, Chiranjeevi, Kapu leader Mudragada Padmanabham, tuni incident, kirlampudi, godavari districts, Congress leader, rajya sabha MP, chandrababu naidu, tuni incident

Condemning the arrest of Kapu leader Mudragada Padmanabham, megastar Chiranjeevi alleged that chief minister Chandrababu Naidu is trying to split the Kapu community.

కాపుల ఐక్యతను విచ్ఛిన్నం చేస్తున్న చంద్రబాబు

Posted: 06/11/2016 12:41 PM IST
Chandrababu bringing differences in kapus alleges chiranjeei

కాపు సామాజిక వర్గంలో వున్న ఐక్యతను విచ్ఛిన్నం చేసే విధంగా చంద్రబాబు కుటిల యత్నాలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ నటుడు చిరంజీవి మండిపడ్డారు.  కాపుల మధ్య చిచ్చు పెట్టే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. కాపు కులస్థుల పట్ల చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై ఆయన తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి ప్రశాంతతకు మారు పేరని చెప్పిన చంద్రబాబు.. ఎక్కడి నుంచి బయటివారు వచ్చి రైలును తగులబెట్టారని చెబుతూనే.. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కాపులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని అరోపించారు.

తూగో జిల్లాకు చెందిన కాపులను రౌడీలుగా, గుండాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని చిరంజీవి ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన ఓ లేఖను విడుదల చేశారు. ముద్రగడ పద్మనాభం అరెస్ట్ను చిరంజీవి తీవ్రంగా ఖండించారు. ముద్రగడ పద్మనాభం అరెస్టు కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యని అయన మండిపడ్డారు. తుని ఘటనలను పురస్కరించుకుని చేస్తున్న అరెస్ట్లు ఏకపక్షంగా ఉన్నాయని చిరంజీవి తన లేఖలో పేర్కొన్నారు.  కాగా తునిలో జరిగిన హింసాత్మక ఘటనలను ఎవరూ సమర్థించరని, బాధ్యులను గుర్తించి చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్సిందే అన్నారు.  

సున్నితమైన సామాజిక సమస్యల పరిష్కారంలో ప్రదర్శించాల్సిన రాజకీయ పరిణితి లేకుండా కక్షగట్టినట్లు వ్యవహరించడం ప్రజాస్వామ్యంలో తగదని చిరంజీవి అన్నారు. మొదటి నుంచి ముద్రగడ పద్మనాభం పట్ల ప్రభుత్వ అనుసరిస్తున్న పంథా...ఘర్షణాత్మకంగా ఉందన్నారు. ఆయన చేస్తున్న దీక్షకు రాజకీయాల్ని ఆపాదించి  సమస్యను పక్కదారి పట్టించడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటో ముఖ్యమంత్రికే తెలియాలన్నారు. తుని ఘటన అంశంలో ప్రభుత్వం సంయమనం పాటించి సమస్యను పరిష్కరించాలని చిరంజీవి సూచించారు. సిబీఐ విచారణ ద్వారానే తుని ఘటన నిందితుల్ని చట్టానికి పట్టించే కార్యక్రమం జరగాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chiranjeevi  Congress leader  rajya sabha MP  chandrababu naidu  tuni incident  

Other Articles