జైరాం పుసక్తం అస్సలు పనికిరాదు | will Jairam book on andhra bifurcation help to congress

Will jairam book on andhra bifurcation help to congress

jairamramesh, The book Old History New Geography, jairam ramesh book on AP bifurcation, former minister jairam ramesh telangana, ఓల్డ్ హిస్టరీ-న్యూ బయోగ్రఫీ, జైరాం రమేష్ విభజనపై పుస్తకం, తెలంగాణ వార్తలు, తాజావార్తలు, latest news, telugu news

jairam ramesh bbok on andhra bifurcation. The book Old History New Geography: Bifurcating Andhra Pradesh by former Union minister Jairam Ramesh gives an account of year-long debates and discussions leading up to the creation of a separate Telangana state in February 2014 after the government had decided to do it in July the previous year.

జైరాం పుస్తకం అస్సలు పనికిరాదు

Posted: 06/11/2016 12:28 PM IST
Will jairam book on andhra bifurcation help to congress

రాష్ట్ర విభజన పాపం ముమ్మాటికీ కాంగ్రెస్ హయాంలోని యూపీఏ ప్రభుత్వానిదే అంటూ అటు బీజేపీ, ఇటు టీడీపీ ఒకే  పాట పాడుతున్నారు. ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను తట్టుకోవడానికి ఆ రెండు పార్టీలకు ఇప్పుడు ఇదే ఆయుధంగా మారింది. రాష్ట్రం విడిపోవటానికి సహకరించిన ఈ రెండు పార్టీలు మరి బిల్లు టైంలో ఏం చేశాయన్నది వారి విచక్షణకే వదిలేద్దాం. నిజానికి తెలంగాణ ఏర్పాటుకు బీజేపీయే ముందునుంచి సుముఖతతో ఉందని ప్ర్యతేకంగా చెప్పనక్కర్లేదు. విభజనను అడ్డుకునేందుకు అనుకున్నంత స్థాయిలో పోరాడకపోగా, అధికారంలోకి వచ్చాక సాయం చేయకపోగా, ఇప్పుడు ప్రజల దృష్టిని మరల్చేందుకు ఒక రక భావన సృష్టించేందుకు విభజన పాపం కాంగ్రెస్ పై రుద్దుతుంది.

రాష్ట్రం సంయుక్తంగా ఉండి ఉంటే టీడీపీ అధికారంలోకి వచ్చేదన్న గ్యారెంటీ లేదు. విభజనతోనే ఆ పార్టీకి పెద్ద మేలు జరిగింది. ఏ మాత్రం సౌకర్యాలు లేని రాష్ట్రానికి చంద్రబాబు లాంటి అనుభవం ఉన్న నేత అయితేనే సమర్థవంతంగా పాలించగలడని భావించిన ఏపీ ప్రజలు తిరిగి అధికారం కట్టబెట్టారు. అసలు ఫలాన్ని అనుభవిస్తున్న ఆ పార్టీ ఇప్పుడు యూపీఏ మోసం చేసిందంటూ దుమ్మెత్తిపోస్తుంది. ఇలాంటి సమయంలో జైరాం రమేష్ లాంటి సీనియర్ కాంగ్ నేత తెరపైకి రావటం పెద్ద విశేషం ఏం కాదు.

ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించిన జైరాంకు ఇక్కడి పరిస్థితులు కూలంకషంగా తెలుసు. అందుకే ఓల్డ్ హిస్టరీ-న్యూ బయోగ్రఫీ పేరిట ఇప్పుడు పుస్తకం రాసేశాడు. ముందుమాటే 42 పేజీలున్న ఈ పుసక్తంలో తెలంగాణ ఉద్యమ నాలుగున్నరేళ్ల కాలాన్ని కళ్ల ముందు ఉంచే ప్రయత్నం చేశారు. తెలంగాణ ప్రకటన, ఆపై వెనకడుగు, విభజనకు అసలు అన్ని పార్టీలు ఏమన్నాయి? చివరికి కాంగ్రెస్ ఎందుకు ఒప్పుకుంది తదితర విషయాలను పూసగుచ్చినట్లు అందులో పేర్కొన్నారు.

అసలు మంత్రివర్గం ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఈ కేంద్ర మాజీ మంత్రిదే. జైరాం సూచన మేరకే అప్పటి హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే గ్రూప్ ఆఫ్ మిస్టర్స్ ను నెలకొల్పారు. తెలంగాణ ఏర్పాటుకు అది చేసిన సమావేశాలే మెట్లు వేశాయన్న సంగతి తెలిసిందే. ఇక రాయల్ తెలంగాణ ప్రతిపాదన ఫైనలైజ్ చేసి చివరకు జీఓఎం 10 జిల్లాల తెలంగాణకు ఆమోదం తెలిపింది. కొత్తగా కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పాటు చేయొద్దన్న ఉద్దేశంతోనే హైదరాబాద్ ను కేంద్రపాలితం చేయలేదని వివరించాడు. కొత్తగా ఏపీ రాజధానిని ప్రకటిస్తే గొడవలు అవుతాయన్న ఉద్దేశంతోనే వెనకడుగు వేసి, ఆ భాద్యతను శివరామకృష్ణన్ కమిటీకి అప్పజెప్పినట్లు తెలిపారు.

ఓవైపు వైఎస్సార్పీపీ బలపడుతున్న వేళ రాష్ట్రం ఏర్పడితే కనీసం తెలంగాణలో టీఆర్ఎస్ విలీనమయి, కాంగ్రెస్ లాభపడుతుందనుకున్న ఆశలకు కేసీఆర్ గండికొట్టాడని వివరించాడు. వెరసి విభజన పాపం తమది ఒక్కరిదే కాదని, ఇందులో చాలా మంది హస్తం ఉందని చెప్పేందుకు చాలానే యత్నించాడు. అయితే సొంత సీఎంలు రోశయ్య, కిరణ్ ల వ్యతిరేకత, తెలంగాణ పై కేసీఆర్ మొండిపట్టు, ఆఖరికి వామపక్షాల వ్యతిరేకత లాంటి వివరాలను విపులంగా పేర్కొన్న జైరాం, ఎక్కడా టీడీపీ, చంద్రబాబు నాయుడు, బీజేపీ నేతల పాత్రను పేర్కొనకపోవటంతో ఈ పుసక్తం పెద్దగా వర్కవుట్ కాలేదనే చెప్పాలి. ప్రజలకు తెలియాల్సిన అసలు మ్యాటర్ తెలిస్తేనే ఎక్కడో ఒక దగ్గర పార్టీకి మళ్లీ జవసత్వాలు పుట్టుకోస్తున్నాయన్న సంగతి గుర్తుంచుకోవాలి. లేకపోతే జైరాం లాంటి వాళ్లు ఇలా కోసరు విషయాలతో ఎంత మొత్తుకున్న అది అరణ్య రోదనే అవుతుంది.  

భాస్కర్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles