చిన్నారి గుండె ఆగకుండా కాపాడాడు | PM Modi helps for pune girl heart surgery

Pm modi helps for pune girl heart surgery

Vaishali Yadav Modi, heart disease, PUNE girl modi, modi 6 years girl, తెలుగు వార్తలు, తాజా వార్తలు, మోదీ వార్తలు, వైశాలి యాదవ్, పుణే చిన్నారి మోదీ, మోదీ గుండె ఆపరేషన్, తాజా వార్తలు, తెలుగు వార్తలు, pune modi, latest news, telugu news

A six-year-old PUNE girl Vaishali Yadav suffering from a heart disease wrote a letter to Prime Minister Narendra Modi seeking financial help which was promptly granted following which she underwent surgery and is now recovering.

చిన్నారి గుండె ఆగకుండా కాపాడాడు

Posted: 06/08/2016 06:29 PM IST
Pm modi helps for pune girl heart surgery

నీవే దిక్కు ..నీవు తప్ప నాకెవ్వరు లేరు తండ్రీ… అంటూ గజేంద్ర మోక్షంలో ప్రార్థించగానే కాస్త ఆలస్యంగా అయినా కదిలి వచ్చిన విష్ణువు మొసలి బారి నుంచి ఏనుగును కాపాడాడు. కానీ, మన ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం అలా కాదు. ఎవరైనా ఆపదలో ఉన్నారంటే చాలు వెంటనే స్పందిస్తున్నారు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరంగా వారిని ఆదుకుంటున్నాడు.

పుణెకు చెందిన ఆరేళ్ల బాలిక వైశాలి యాదవ్ చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతుంది. గుండెలో రంధ్రం ఉండటంతో ఆపరేషన్ చేస్తేనే ఆమె బతుకుతుందని వైధ్యులు తేల్చి చెప్పారు. పేదరికానికి మగ్గుతున్న ఆమె కుటుంబానికి సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేరు. దీంతో వైశాలికి ఓ ఆలోచన వచ్చింది.  తన వ్యాధి, పేదరికాల గురించి ఆమె ఓ లేఖ రాసి, దానికి తన స్కూల్ ఐడీ కార్డును జతచేసి ప్రధానమంత్రి కార్యాలయానికి (పీఎంవో) పంపింది. అంతే కేవలం అయిదంటే అయిదు రోజుల్లో స్పందించిన ప్రధాని మోదీ.. ఆమెకు చికిత్స చేయించాల్సిందిగా జిల్లా కలెక్టర్ కు లేఖ రాయించారు.

ఇక కలెక్టర్ చోరవతో కదిలిన రూబీ హాల్ క్లినిక్ ఆమెకు ఉచితంగా ఆపరేషన్ చేసింది. "ఎన్నో ఆసుపత్రులకు మా అంకుల్ వెళ్లారు. ప్రయోజనం లేకపోయింది. నా పక్కన విచారంగా కూర్చున్న ఆయనను చూస్తుండగానే టెలివిజన్ స్క్రీన్‌పై మోదీ కనిపించారు. వెంటనే పెన్నూ పేపరూ తెచ్చాను. నా పరిస్థితిని వివరిస్తూ మోదీకి లేఖ రాస్తానని చెప్పాను. అప్పుడు ఉచితంగా ఆపరేషన్ జరుగుతుందని అన్నాను. మా అంకుల్ కూడా సరేనన్నారు. నా నోట్‌బుక్‌లో ఒక పేజీ చించి మోదీకి సవివరంగా లేఖ రాశాను. నా గుండె పరిస్థితి వివరించి చెప్పాను" అని వైశాలి తెలిపింది.

వైశాలి కుటుంబం దారిద్ర్యపు రేఖకు దిగువన ఉన్నప్పటికీ అందుకు సంబంధించి సరైన పత్రాలు లేకపోవటంతో చికిత్సకు వీలుపడలేదు. కాగా, బాలికకు ఆపరేషన్ చేయాలని నేరుగా ప్రధానమంత్రి నుంచే లేఖ రావడంతో షాక్ కి గురైనట్లు జిల్లా సర్జన్ డా.సంజయ్ దేశ్ ముఖ్ తెలిపారు. కాగా, ఇలా సాయం కావాలంటూ వస్తున్న విజ్నప్తులను తన దృష్టికి తీసుకురావటంతోపాటు, త్వరగతిన వాటిని పరిష్కరించాలని ఆయన పీఎంవో అధికారులను ఆదేశించారంట.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vaishali Yadav Modi  heart disease  PUNE girl modi  modi 6 years girl  

Other Articles