Mudragada to go on hunger strike from tomorrow

Mudragada fast unto death from tomorrow

kapu reservation stir, kapu garjana, tuni violence, mudragada padmanabham, amalapuram one town police station, Mudragada fast unto death, mudragada hunger strike, NTR,

Hillary Clinton has a "volcanic" temper and a loud fight she had with Bill Clinton in 1995 left the then US President with a black eye, an ex-Secret Service officer has claimed in a 'tell-all' book.

హింసా రాజకీయాలు వెన్నతోపెట్టిన విద్య.. 9న అమరణ దీక్ష

Posted: 06/08/2016 09:52 AM IST
Mudragada fast unto death from tomorrow

తన స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసిన చరిత్ర ముఖ్యమంత్రి చంద్రబాబుదని కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ధ్వజమెత్తారు. చంద్రబాబుకు హింసా రాజకీయాలు వెన్నతో పెట్టిన విద్యగా అయన అభివర్ణించారు. ‘1984లో ఎన్టీఆర్ పదవి పోయినప్పుడు రామకృష్ణా థియేటర్‌లో కూర్చొని ఫోన్ల ద్వారా రాష్ట్రంలో విధ్వంసం సృష్టించేందుకు ప్రేరేపించినది ఎవరని ఆయన ప్రశ్నించారు. పరిటాల రవి హత్య రోజున అన్ని జిల్లాల్లోనూ పార్టీ సమావేశాలు పెట్టి తగలబెట్టండని దహనకాండను ప్రేరేపించింది మీరు కాదా?’ అని నిలదీశారు.  

కాపు ఉద్యమంలోనే హింసాత్మక ఘటనలు చోటుచుసుకున్నాయని ప్రజల్ని మధ్యపెడుతున్న చంద్రాబాబును ఈ కేసులకు సంబంధించి ముందుగా అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నేరం చేసేవాడికన్నా, తెర వెనకునుండి ప్రోత్సహించేవాడికే పెద్ద శిక్ష పడుతుందని.. అలాంటప్పుడు ఈ హింసాత్మక ఘటనలకు సంబంధించి చంద్రబాబును ఏ-1 గా చేర్చి అరెస్టు చేయాలన్నారు. రాజమండ్రి పుష్కరాలకు రాష్ట్రంలోని పోలీసులను తరలించి.. సొంత ఇమేజ్ కోసం 29 మందిని పొట్టన పెట్టుకున్న బాబూ.. దీనిపై ఎందుకు కేసులు లేవు.. ఎవరిని అరెస్టు చేశారు? అని ప్రశ్నించారు. కాపు కులాలైన కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలను విభజించి తమ జాతిని దగా చేయాలని చంద్రబాబు చూస్తున్నారని ఆరోపించారు.

తునిలో రత్నాచల్ ఎక్స్ ప్రెస్ రైలు దహనం కేసును ప్రభుత్వం తక్షణం ఉపసంహరించుకోని పక్షంలో ఈనెల 9 నుంచి తాను మరోమారు అమరణ నిరాహార దీక్షకు ఉపక్రమిస్తానని హెచ్చరించారు. తమ కులస్థులపై పెట్టిన కేసులను ఇవాళ సాయంత్రానికి ఉపసంహరించుకోవాలని ఆయన డెడ్ లైన్ కూడా విధించారు. ప్రభుత్వం స్పందించకపోతే గురువారం ఉదయం 9 గంటలకు కిర్లంపూడిలోని తన నివాసంలో ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని ప్రకటించారు. చంద్రబాబు ప్రభుత్వం తమ కాపు కులస్థులను నేరస్థులుగా, అరాచక శక్తులుగా చూపించి కేసులు పెట్టారన్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kapu reservation stir  kapu garjana  tuni violence  mudragada padmanabham  hunger strike  

Other Articles