కేరళ అమ్మాయిలు జీన్స్ విప్పడానికి కారణం తెలుసా? | mahesh babu behind Kerala college girls wore lungi

Mahesh babu behind kerala college girls wore lungi

mahesh babu, srimanthudu, kerala girls lungi avatar, mahesh babu kerala girls lungi avatar, girls in lungi, తాజా వార్తలు, తెలుగు వార్తలు, మహేష్ కేరళ అమ్మాయిలు, అమ్మాయిలు లుంగీ కేరళ, కేరళ అమ్మాయిల లుంగీ ఫోటో, latest photo, telugu news, entertainment

mahesh babu behind Kerala college girls wore lungi. A photo of a group of girls wearing lungi (a traditional garment worn by men) claimed to be from a college in Kerala is going viral on social media. The people sharing the photo are saying that it was a protest staged by a group of college girls after the college in Kerala banned wearing jeans.

కేరళ అమ్మాయిలు జీన్స్ విప్పడానికి కారణం తెలుసా?

Posted: 06/08/2016 10:18 AM IST
Mahesh babu behind kerala college girls wore lungi

తమ కాలేజీలో జీన్స్ నిషేధాన్ని నిరసిస్తూ కొంతమంది కేరళ అమ్మాయిలు దిగిన ఫోటో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తమ జీన్స్ ప్యాంట్లను విప్పేసిన ఆ అమ్మాయిలు వరుసగా నిల్చుని, లుంగీలు కట్టి మరీ ఫోజులిచ్చారు. మొకాళ్ల దాకా లుంగీ మడిచి స్టైల్ గా దిగిన ఆ ఫోటోలుగత రెండు రోజులుగా వైరల్ అవుతున్నాయి. కాలేజీ యాజమాన్య ఉత్తర్వులకు నిరసనగానే తాము ఈ పని చేశామంటూ కింద సందేశాన్ని కూడా పోస్ట్ చేశారు. అయితే ఆ అమ్మాయిల లుంగీ కహానీ అందుకు కాదంట. సదరు ఫొటో రియల్ దే అయినప్పటికీ, కారణం మాత్రం వేరే ఉందని తెలుస్తోంది.

ఆ అమ్మాయిలంతా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్. గతేడాది శ్రీమంతుడు సినిమాలో మహేష్ ఓ పాటలో లుంగీ అవతారంలో కనిపించిన సంగతి తెలిసిందే.  సినిమా రిలీజైన టైంలోనే వారంతా ఆ ఫోటోలు దిగి ఫేస్ బుక్, ట్విట్టర్లో పోస్ట్ చేశారు. మగరాయుళ్లలా ఫోజులిస్తూ దిగిన ఆ ఫోటోలను అప్పట్లో పలువురు సెలబ్రిటీలు కూడా షేర్ చేశారు కూడా. అయితే ఇప్పుడు అదే ఫోటోను మళ్లీ అప్ లోడ్ చేసి ఇలా ఓ కాలేజీ యాజమాన్యంను వార్తల్లోకి ఎక్కించారు. ఆ పని చేసింది ఎవరో తెలీకపోయినా పాత ఫోటోతో మళ్లీ బాగా ఫేమస్ అయ్యారంటూ ఇప్పుడు చమ్మక్కులు పేలుతున్నాయి.

ఇక ఇప్పుడు ఈ ఫోటో, వార్త నిజమనుకున్న పలువురు సెలబ్రిటీలు కూడా మోసపోయారు. హాట్ యాంకర్ అర్చనా విజయ్ ఫెమినిజం, వారి పోరాటం అద్భుతం అంటూ ఓ ట్వీట్ చేయగా,  ఫేమస్ హెర్ స్టైలిష్  స్వప్న మోతీ భవానీ వారి నైతికతకు జోహార్లు అంటూ మళ్లీ ఆ ఫోటోతో పోస్ట్ చేసింది. అసలు ఈ అమ్మాయిలంతా కేరళకు చెందినవారా? తెలుగువారా? అన్న విషయంలో కూడా అసలు క్లారిటీ లేదంటూ ఓ విషయాన్నంతా ప్రముఖ దిన పత్రిక ‘మిడ్ డే’ తన కథనంలో పేర్కొంది.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mahesh babu  srimanthudu  kerala girls lungi avatar  mahesh babu kerala girls  

Other Articles