Lion charges and pounces on little boy in zoo - but smashes into glass

Lion attacks a child in zoo park

Lion charges on little boy, Lion charges on little boy in zoo, lion pounces on little boy, lion pounces on toddler, lion charges on toddler in zoo, Chiba, lion, glass, zoo, Japan, pounce

A heart-stopping video has emerged showing a lion charge at a tiny boy who unwittingly engaged it in a staring contest while visiting the zoo.

ITEMVIDEOS: గుండెలదిరే సీన్.. పసివాడిపై పంజా విసిరిన మృగరాజు

Posted: 06/05/2016 03:29 PM IST
Lion attacks a child in zoo park

మనకు తెలియకుండానే మన వెనుకాలే ఎవరో గుట్టుచప్పుడు కాకుండా అడుగులు వేస్తున్నారంటేనే కొంత గుండెల్లో వణుకు పుడుతుంది. అలాంటిది ఒక సింహం అడుగులేస్తే.. అది కూడా తొలుత నెమ్మది ఆ తర్వాత రాకెట్ వేగంగా అమాంతం మీదపడ్డట్లుగా. ఒక బుల్లి బాలుడికి ఇలాంటి అనుభవం ఎదురైంది. అయితే, ఆ సింహం వస్తుందన్న ఆలోచన ఆ బాలుడికి లేదు.. ఆ అడుగుల చప్పుడు వినిపించలేదు.. ఆ సింహం వచ్చి మీద పడలేదు. ఎందుకంటే ఆ సింహానికి బాలుడికి మధ్య ఓ బలమైన గాజుఫలకమే అతడికి శ్రీరామ రక్షలాగా నిల్చుంది. లేదంటే ఆ భారీ సింగానికి అతడు కోడిపిల్లమాదిరిగా నలిగిపోయేవాడు.

ఈ ఘటన జపాన్లోని చిబా అనే ఓ జూలో చోటు చేసుకుంది. సీసీకెమెరాలో రికార్డయిన ఈ దృశ్యాన్ని చూసి సెక్యూరిటీ సిబ్బంది కూడా ఉలిక్కిపడ్డారు. సీసీటీవీలో రికార్డయిన ప్రకారం ఓ రెండేళ్లబాలుడు ఓ సింహాన్ని గాజు ఫలకం ఎన్ క్లోజర్ నుంచి తీక్షణగా చూశాడు. ఆ సమయంలో సింహం కూడా ఎంతో వినమ్రంగా వెనక్కి అడుగులు వేసి రెండు కాళ్లు ముందుకు చాపి ఓ పదడుగుల దూరంలో బుద్ధిగా కూర్చుంది. కానీ, దాని చూపు చూస్తే మాత్రం దాడికి సిద్ధమయిందనే విషయం స్పష్టంగా తెలుస్తుంది.

అలా సింహాన్ని చూసిన బాలుడు వెనక్కి తిరిగాడో లేదో క్షణం కూడా ఆలస్యం చేయని ఆ సింహం అమాంతం లంఘించి ఆ బాలుడిపైకి వచ్చి మధ్యలో ఉన్న గాజు ఫలకాలనికి బలంగా తగిలింది. ఆ వెంటనే బాలుడిని అందుకోవాలన్న ఆక్రోశంతో పదేపదే గాజు ఫలకాన్ని తట్టింది. ఆ సమయంలో ఓసారి వెనక్కి తిరిగి చూసిన బాలుడు అదిరిపడ్డాడు. ఇలా అక్కడ గాజు ఫలకం ఉందనే విషయ కూడా మరిచి ఆశపడిన సింహం వ్యూహం బెడిసికొట్టింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chiba  lion  glass  zoo  Japan  pounce  

Other Articles