బాలీవుడ్ సీనియర్ నటి శులభ దేశ్‌పాండే ముంబైలోని స్వగహంలో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శులభ గతరాత్రి మరణించినట్టు అమె కుటుంబ సభ్యులు తెలిపారు. మరాఠీ, హిందీ సినిమా రంగాలలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని అక్రమించిన అమె మరణంతో బాలీవుడ్ ప్రముఖులు విషాదంలో మునిగారు. ఇటు మరాఠీ సినీ పరిశ్రమ కూడా విషాధఛాయలు అలుముకున్నాయి. అమె మృతి పట్ల పలువురు బాలీవుడ్, మరాఠీ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేశారు.
బాలీవుడ్ సినీనిర్మాత మధుర్ బండార్కర్ శులభ దేశ్ పాండే మృతి వార్త తమను దిగ్ర్భాంతికి గురిచేసిందన్నారు. అమె మరాఠీ నాటకరంగానికి, హిందీ చలనచిత్ర రంగానికి అందించిన సేవలను తాము ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుంటామన్నారు. అలనాటి హీరోయిన్లు మాధురీ దీక్షిత్, రవీనా టాండన్ లు కూడా అమె మృతి పట్ల తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. అమె చాలా అత్మీయురాలని, దాంతో పాటు బహుచక్కని నటి అని కోనియాడారు. వీరితో పాటు నటి రిచా చద్దా, టీవీ నటి పల్లవీ జోషీ తమ దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. అటు సోను నిగమ్, లతా మంగేష్కర్ కూడా శులభ దేశ్ పాండే మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు.
మహారాష్ట్రకు చెందిన పలువురు రాజకీయ నేతలు కూడా అమె మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు. అమె కుటుంబసభ్యులకు సానుభూతిని ప్రకటించారు. 79 ఏళ్ల శులభ పలు మరాఠీ, హిందీ సినిమాలతో పాటు సీరియళ్లలో నటించారు. హిందీలో విజయవంతమైన భూమిక, అరవింద్ దేశాయ్ కీ అజీబ్ దస్తాన్, గమన్ సినిమాలతో పాటు ఇటీవల ఇంగ్లీష్-వింగ్లీష్ సినిమాలో నటించారు. మరాఠీలో రంగస్థల సంస్థ రంగయాన్‌తో కలసి పనిచేశారు. భర్త అరవింద్ దేశ్‌పాండేతో కలసి 1971లో ఆవిష్కార్ అనే థియేటర్ గ్రూపును స్థాపించారు. అరవింద్ దేశ్‌పాండే 1987లో మరణించారు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
May 21 | తెలుగు చిత్రపరిశ్రమలో ప్రస్తుతం సక్సెస్ ఫుల్ చిత్రాల దర్శకుల జాబితా పెరగడం సంతోషమే. విజయవంతమైన చిత్రాలతో ఆ జాబితాలో నిలిచిన మరో దర్శకుడు అనీల్ రావిపూడి. లో ప్రస్తుతం తలెుగు చిత్రఅనిల్ రావిపూడి దర్శకత్వంలో... Read more
May 20 | రాష్ట్రంలో మళ్లీ కరోనా కేసులు పెరిగే అవకాశం ఉన్నదని ఆరోగ్యశాఖ ఆందోళన వ్యక్తంచేస్తోంది. పాత జన్యురూపాన్ని మార్చుకొని వచ్చిన కొత్త రకం (బీఏ4) వైరస్‌కి వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని టెన్షన్ పడుతుంది. ప్రస్తుతం ఈ... Read more
May 20 | ఓ వైపు వేదమంత్రోచ్ఛరణలు.. మాంగళ్యం తంతునానీనాం.. అంటూ.. వధూవరులను భార్యభర్తలుగా మార్చే పవిత్రమైన మంత్రాన్ని అందుకున్నారు అయ్యవారు. ఇంతలో ఆగండీ అన్న శబ్దం వినిపించింది. కళ్యాణమండపం ప్రధాన ద్వారం వరకు పెళ్లి వేదిక సహా..... Read more
May 20 | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసు నిందితుల ఎన్కౌంటర్ బూటకమని జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ తేల్చిచెప్పింది. నిందితులు పోలీసుల నుంచి తుపాకీలు లాక్కుని కాల్పులు జరిపారన్నది నమ్మశక్యంగా లేదని స్పష్టం చేసింది. నిందితులపై పోలీసులు... Read more
May 20 | రాజకీయాల్లో దూకుడుగా వెళ్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలగాణ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో జనసేన పార్టీ పరిమితి సంఖ్యలో పోటీ చేయబోతోందని అభిమానులకు నూతనోత్తేజం కలిగించేలా... Read more