Education policy: Make our report public or I will, TSR Subramanian to Smriti Irani

Make our report public or i will tsr subramanian to smriti irani

new education policy, smriti irani, smriti irani education policy, tsr subramanian, hrd ministry, no fail policy, no fail policy reform, rte, right to education, hrd ministry, education ministry, education news, india education,

The 200-page report, by TSR Subramanian five member pannel contains close to 90 suggestions including reinstating detention of students beyond Class V.

స్మృతి ఇరానీ.. మా నివేదిక బహిర్గతం చేయండీ.. లేదా..?

Posted: 06/03/2016 10:26 AM IST
Make our report public or i will tsr subramanian to smriti irani

నూతన జాతీయ విద్యా విధానంపై తామిచ్చిన నివేదికను బహిర్గతం చేయాలని లేనిపక్షంలో అపనని తామే చేస్తామని కేంద్ర మానవవనరులశాఖ మంత్రి స్మృతి ఇరానీని మాజీ క్యాబినెట్ కార్యదర్శి టీఎస్ఆర్ సుబ్రహ్మణ్యన్ అన్నారు. ఈ మేరకు ఆయన స్మృతి ఇరానీకి లేఖ రాశారు. తమ ప్యానెల్ రూపోందించిన నివేదికను, అందులోని సూచనలు బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నూతన జాతీయ విద్యా విధానం కోసం వరకు కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీకి సుబ్రహ్మణ్యన్ చైర్మన్ వ్యవహరించారు.

ఇటీవల నూతన జాతీయ విద్యావిధానంపై క్షేత్రస్థాయి నుంచి అధ్యయనం చేసిన కమిటీ 33 అంశాలపై పలు సూచనలు పేర్కోంటూ సుమారుగా 200 పేజీలకు పైగా నివేదికను కేంద్రానికి సమర్పించారు. ఐదుగురు సభ్యుల కమిటీలో గుజరాత్, ఢిల్లీకి చెందిన మాజీ మానవ వనరుల శాఖ కార్యదర్శులు, శైలజా చంద్ర, సుధీర్ మన్ కడ్, మాజీ ఎన్సీఈఆర్టీ ఛీఫ్ జేఎస్ రాజ్ పుత్ లు కూడా సభ్యులుగా వ్యవహరించారు. గత నెల 27న ఈ ప్యానెల్ తమ నివేదికను కేంద్రానికి సమర్పించింది.

అయితే దీనిపై ఇప్పటి వరకు కేంద్ర మానవ వనురుల శాఖ ఎలాంటి ప్రకటన చేయకపోడం మరీ ముఖ్యంగా గత రెండేళ్ల కాలంలో ఏం సాధించారన్న మీడియా ప్రశ్నలపై కూడా కేంద్రమంత్రి ఈ వివరాలను వెల్లడించకపోవడం ప్యానల్ చైర్మన్ కు లేఖ రాసే అవసరాన్ని తీసుకువచ్చినట్లుంది. స్కూలు వ్యవస్థపై ఇప్పటికే చాలా నిర్ణయాలు తీసుకున్నామని, పిల్లల వివరాలు సేకరించడం ప్రారంభించామని.. ఆవి లేని కారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థుల కోసం ఎలాంటి ప్రణాళికలు రూపొందించలేదని మాత్రమే స్మృతి ఇరాని పేర్కొన్నారు. దీంతో తాము ఇచ్చిన నూతన జాతీయ విద్యా విధానం నివేదికను బయటపెట్టాలని అయన కోరారు. దీనిపై మానవ వనరుల శాఖ నుంచి ఇప్పటి వరకు స్పందించలేదు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Smriti Irani  TSR subramanian  new national educational policy  HRD ministry  

Other Articles