28 క్రిమినల్ కేసులతో రాజ్యసభకు... | Bihar BJP RS candidate faces 28 criminal cases

Bihar bjp rs candidate faces 28 criminal cases

Bhartiya Janata Party, Gopal Narayan Singh, Rajya Sabha candidate, 28 serious criminal cases, బీజేపీ, బీహార్ రాజ్యసభ అభ్యర్థి, 28 క్రిమినల్ కేసులు, రాజ్యసభ అభ్యర్థి, latest news, political news, politics, national news

The surprise nomination of Bhartiya Janata Party candidate Gopal Narayan Singh for the Rajya Sabha seat from Bihar has baffled many political parties and leaders in the State with the ruling Janata Dal (United) on Tuesday alleging that he has 28 serious criminal cases pending against him.

28 క్రిమినల్ కేసులతో రాజ్యసభకు...

Posted: 06/01/2016 12:32 PM IST
Bihar bjp rs candidate faces 28 criminal cases

నేరచరితులైన వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేయటం, గెలిచి ఉన్నత పదవులు చేపట్టం మనం రెగ్యులర్ గా చూస్తూనే ఉంటాం. అధికారంలోకి వచ్చాక కూడా ఆ వాసన పోని నేతలు వాటిని కంటిన్యూ చేయటం కూడా అనేక సందర్భాల్లో గమనించాం కూడా. అయితే ఇక్కడో పెద్దాయన విషయం మాత్రం నిజంగా ప్రత్యేకం. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 28 క్రిమినల్ కేసులున్న వ్యక్తిని ఏకంగా రాజ్యసభకు పంపాలని చూడటంతో విమర్శలు వినిపిస్తున్నాయి.

బీహార్ నుంచి గోపాల్ నారాయణ సింగ్ అనే నేతను బీజేపీ రాజ్యసభ బరిలో నిలిపింది. అయితే ఆయనపై 28 క్రిమినల్ కేసులున్నాయని, అవన్ని చాలా తీవ్రత గల కేసులని, అలాంటి వ్యక్తిని బరిలో ఎలా దింపుతారని అధికార జేడీయూ ప్రశ్నిస్తోంది. ఈ మేరకు ఆయనపై ఉన్న కేసులతో కూడిన లిస్ట్ ను తయారు చేసి మీడియా ముందుంచింది. ఎంతో మంది సీనియర్ నేతలు, అర్హత గల వ్యక్తులు ఆ పార్టీలో ఉన్నారు. వారందరినీ కాదని ఓ క్రిమినల్ ని బరిలో దింపడంతో ఆ పార్టీ వైఖరి, దృక్పథం ఎలాంటివో అర్థం చేసుకోవచ్చంటూ జేడీయూ అధికార ప్రతినిధి సంజయ్ సింగ్ చెబుతున్నాడు.  

కాగా, నారాయణ సింగ్ సాసారాంలో నారాయణ మెడికల్ కాలేజీ అధిపతి. గత అసెంబ్లీ ఎన్నికలలో నబినగర్(ఔరంగబాద్) నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మెడికల్ సీట్లను అడ్డగొలుగా అమ్ముకోవటంతోపాటు, పలు హత్యకేసులతో సంబంధం ఉన్నట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. అయినా బీజేపీ సుశీల్ మోదీ లాంటి సీనియర్ ను కాదని మరీ ఈయనకు సీటు ఇచ్చింది.

ఈ ఆరోపణలపై నారాయణ సింగ్ స్పందిస్తూ... ఆ కేసులన్నీ రాజ‌కీయ స్వార్థప్రయోజ‌నాల కోసమే పెట్టినవని చెబుతున్నారు. రాజ్యసభ సీటుకు తాను అన్ని విధాల అర్హుడని భావించే పార్టీ తనకీ అవకాశం ఇచ్చిందని, ఆరోపణలను పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles