హరీష్ రావు భలే తప్పించుకున్నాడు | harish rao reply for competition in TRS

Harish rao reply for competition in trs

TRS, harish rao, KCR, KTR, కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, latest news, telanagana news, political news, politics

there is no competition in TRS for CM post harishrao said.

హరీష్ రావు భలే తప్పించుకున్నాడు

Posted: 06/01/2016 11:20 AM IST
Harish rao reply for competition in trs

తెలంగాణకు తదుపరి ముఖ్యమంత్రి ఎవరూ? కేసీఆర్ ఉండగా ఈ ప్రశ్న ప్రస్తుతానికి అప్రస్తుతం. అయితే రెండో ర్యాంకు ఎవరన్న టాపిక్ మాత్రం లేవనెత్తడానికి మనకు స్వేచ్ఛ ఉంది. కుటుంబపాలన తో దోచుకుంటున్నారని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నప్పటికీ వాటిని ఖాతరు చేయకుండా తమ తమ అభివృద్ధి పనులతో వాళ్ల నోళ్లకు మూతలు వేయిస్తున్నారు మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ లు. గులాబీ బాస్ తర్వాత పొజిషన్ ఎవరంటే మాత్రం ఇప్పటికీ వీరిద్దరి పేర్లే వినిపిస్తాయి కూడా. వీరిలో హరీష్ రావు సీనియర్ అని తెలిసిందే. ప్రస్తుతం టీఆర్ఎస్ లో లౌక్యం ఉన్న నేతగా విషయాలను చక్కబెట్టడంలో, దౌత్యాలు నడపటంలో ఈయన్నీ మించినవారు లేదరు. అలాంటిది గత కొంత కాలంగా మేనల్లుడు హరీష్ రావును కేసీఆర్ పక్కనపెట్టి కొడుక్కి ప్రాధాన్యం ఇస్తున్నాడని ఓపెన్ టాక్. కీలకమైన గ్రేటర్ బాధ్యతలను కొడుక్కి అప్పజెప్పటం ద్వారా హరీష్ ను నెమ్మదిగా సీఎం రేసు నుంచి తప్పిస్తున్నాడని గుసగుసలు వినిపించాయి. అయితే అదే టైంలో  నారాయణఖేడ్ ఉపఎన్నిక ఉండటం, అది కూడా కీలకం కావటంతో హరీష్ ను అటు మళ్లీంచారని కవర్ చేశారు. కానీ, తన వర్గంలోని వ్యక్తులకు కూడా మంత్రి పదవులు ఇవ్వటం లేదంటూ  తీవ్ర అంసతృప్తిలో ఉన్నాడని, అందుకే గత కొంత కాలంగా క్రియాశీలకంగా ఉండటం తగ్గించాడని వదంతులు వినిపించాయి. దీనిపై ఎట్టకేలకు ఆయన స్పందించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన్ను ఓ మీడియా చానెల్ ఇంటర్వ్యూ చేసింది. కేసీఆర్ వారసుడు ఎవరని ప్రశ్నించిన యాంకర్ కు చాలా తెలివిగా ఆయన సమాధానమిచ్చారు. మరో 20 ఏళ్లపాటు కేసీఆరే తెలంగాణకు ముఖ్యమంత్రి గా ఉంటారని, అలాంటప్పుడు వారసుడి గురించి ప్రస్తావన తేవాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు.  టీఆర్ఎస్ లో నంబర్ గేమ్ ఉందని ఎవరు చెప్పారు. అభివృద్ధి విషయంలో ఎవరం వెనక్కి తగ్గటం లేదు. నేను క్రియాశీలకంగా లేనని ఎవరన్నారంటూ ఎదురు ప్రశ్న వేశారు. అసలు దీనిపై చర్చ అసందర్భం అంటూ తేల్చి చెప్పారు. తన వారసుడిగా తనయుడు కేటీఆర్ ను కేసీఆర్ తయారు చేసుకుంటున్నాడని ఊహగానాల తరుణంలో హరీష్ రావు ఇలాగాక ఇంకెలా రియాక్ట్ అవుతాడులేండి.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TRS  harish rao  KCR  KTR  next CM  telugu news  

Other Articles