'For experiments with untruth': Twitter has a laugh as BS Bassi is appointed to UPSC

Former delhi police chief bs bassi appointed upsc member

bs bassi, bassi, upsc, former delhi police commissioner, bs bassi upsc, union public service commission, bassi upsc member, upsc council bassi, bassi upsc appointment, bassi upsc tenure

Former Delhi Police Commissioner BS Bassi’s appointment as a member of the Union Public Service Commission elicited much mirth on social media.

యూపీఎస్సీలో బస్పీ నియామకంపై ట్విటైరైట్ల సెటర్లు, జోకులు..

Posted: 05/31/2016 09:22 PM IST
Former delhi police chief bs bassi appointed upsc member

ఢిల్లీ వివాదాస్పద మాజీ పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సభ్యుడిగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ పదవిలో ఆయన ఐదేళ్ల పాటు 2021 ఫిబ్రవరి వరకు అంటే అయనకు 65 ఏళ్ల సంక్రమించే వరకు కొనసాగనున్నారు. యూపీఎస్సీలో ఒక చైర్మన్తో పాటు 10 మంది సభ్యులుంటారు. ఐఏఎస్, ఐపీఎస్, ఇతర ఆలిండియా సర్వీసుల ఉద్యోగాలను యూపీఎస్సీ భర్తీ చేస్తుంది. 1977 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన బస్సీ (60) ఈ ఏడాడి ఫిబ్రవరిలో ఢిల్లీ పోలీస్ చీఫ్‌గా రిటైరయ్యారు.

ఢిల్లీ పోలీస్ కమిషనర్గా బస్సీ పదవీకాలంలో పలు విమర్శలు వచ్చాయి. అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆప్ సర్కార్తో ఘర్షణాత్మక వైఖరి అవలంభించారన్న ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు జవహార్ లాల్ నెహ్రాూ విశ్వవిద్యాలయంలో విద్యార్థి సంఘం నాయకుడు కన్హయ్య కుమార్ సహా పలువురు విద్యార్థులను రాజద్రోహం కేసులో అరెస్టు చేసి కోర్టులో హజరుపర్చారు. వీరిని కోర్టులో హజరుపర్చే క్రమంలో వారిపై న్యాయవాదుల వేషంలో వచ్చిన పలువురు అగంతకులు దాడికి కూడా ఆయన కారణమనే విమర్శలు వచ్చాయి.

ఈ ఘటన తరువాత న్యాయవాదులు, న్యాయస్థానంలో అధికారులంటూ.. కన్హయ్య కుమార్ తదితర నిందితుల కోసం అప్పటికే తగు భద్రతను ఏర్పాటు చేశామని అంతకన్నా అధికంగా భద్రతను ఏర్పాటు చేయడం అసాధ్యమంటూ చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదమయ్యాయి. అంతేకాదు విద్యార్థి సంఘం నాయకులకు పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ అధినేత హఫీజ్ సయ్యూద్ ప్రోత్భలంతోనే వారు దేశవ్యతిరేక నినాదాలు చేశారని, ఇందుకు సంబంధించిన ఫేక్ ట్విట్ కూడా ఆయన సృష్టించినట్లు అరోపణలు ఎదుర్కోన్నారు.

బస్సీతో వున్న వైరుద్యంతో ఆయన యూపీఎస్సీ సభ్యుడిగా నియామకంపై స్పందించిన అప్.. బస్సీ బీజేపి ప్రభుత్వానికి అధికార ప్రతినిధిగా మారారని విమర్శించింది. ఈ విషయాన్ని ఇప్పుడైనా దేశ ప్రజలు గమనించాలని అప్ సూచించింది. ఇక ట్విట్టరైట్లు మాత్రం సెటైర్లు, జోకులను పంచుకున్నారు. జేఎన్యూ, హెచ్ సి యూ విదార్థులు ఇక పబ్లిక్ సర్విస్ కమీషన్ పరీక్షలకు సిద్దం కావాల్సిన అవసరం లేదని పేర్కోంటే.. విశ్వవిద్యాలయాల్లో ఏబీవిపీలో చిన్న పదవిలో కొనసాగినా ఇక పదవులు వచ్చేస్తాని మరికోందరు సెటైర్లు విసిరారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Delhi Former police chief  B S Bassi  UPSC member  

Other Articles