జంప్ జిలానీలు వెనక్కా? టూమచ్! YSRCP jumping MLAs ready to back

Ysrcp jumping mlas ready to back

YSRCP, six MLAs, TDP, వైఎస్సార్సీపీ, ఆరుగురు ఎమ్మెల్యేలు, AP news, AP politics, political news

YSRCP says MLAs keep in touch to back again from TDP.

జంప్ జిలానీలు వెనక్కా? టూమచ్!

Posted: 05/31/2016 05:13 PM IST
Ysrcp jumping mlas ready to back

నాలుగో అభ్యర్థిత్వం ఉత్కంఠ కొనసాగుతున్న తరుణంలో టీడీపీని ఇరకాటంలో పెట్టేందుకు ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ప్రయత్నాలు ప్రారంభించింది. అభ్యర్థిని నియమించినా తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని అంటూనే విజయసాయిరెడ్డి గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తోంది. పోటీ నిలపడం వల్ల తమ పార్టీకి కలిగే నష్టం ఏం లేదని ధృఢనిశ్చయంతో ఉంది. అదే టైంలో జంపింగ్ జపాంగ్ లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

తమ పార్టీ నుంచి టీడీపీలోకి చేరిన 17 మంది ఎమ్మెల్యేలలో ఆరుగురు తిరిగి వైసీపీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రకటించింది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు కాకాని గోవర్థన్, ప్రతాప్ కుమార్ లు మీడియా సమావేశం నిర్వహించి మరీ ఈ విషయం వెల్లడించారు. ‘‘ఆ ఆరుగురు మాతో టచ్ లో ఉన్నారు. వారంతా పశ్చాత్తాపం పడుతున్నారు.  టీడీపీలోకి వెళ్లాక తమ పరిస్థితి దారుణంగా తయారయ్యిందని చెబుతున్నారు. అక్కడ వారికి ప్రాధాన్యం ఉండకపోగా, అవమానాలు ఎదుర్కొవాల్సి వస్తుందని వాపోయారని’’ చెప్పారు. అంతేకాదు ఎలాగైనా సరే ఈ కుంపంలోంచి బయటపడి తిరిగి సొంత గూటికే చేరతామని వారు ఖరాకండిగా చెప్పారంట. ఒక్కో ఎమ్మెల్యేకి 40 కోట్లు చెల్లించి కొనుగోలు చేసేందుకు బాబు యత్నిస్తున్నాడని వారు ఆరోపిస్తున్నారు.

ఒకసారి పార్టీ మారటం తిరిగి సొంత గూటికి చేరటం జరిగిన సందర్భాలు అనేకం. అయితే అధికారంలో ఉన్న పార్టీని కాదని, తిరిగి ప్రతిపక్షంలో కూర్చోవాలని ఎవరూ కోరుకోరు కదా. రాజ్యసభ స్థానం కోసం ఇప్పటికే తెలుగుదేశం ఆకర్ష్ ను ప్రారంభించిందన్న పుకార్ల నేపథ్యంలో,  సొంత గూటికి చేరతారనే వదంతులు సృష్టించడం ద్వారా నష్ట తీవ్రతను కాస్తలో కాస్త అయిన తగ్గించవచ్చన్న ప్రతిపక్షం ఆలోచన కాబోలు.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YSRCP  six MLAs  TDP  

Other Articles