అత్తతో అక్రమ సంబంధం... భార్య బలి | husband affair with mother in law wife suicide in nalgonda

Husband affair with mother in law wife commits suicide in nalgonda

jhansirani suicide case, husband affair with mother in law, nalgonda, అత్తతో అక్రమ సంబంధం, ఝూన్సీరాణి ఆత్మహత్య, నల్గొండ, latest news, telangana news

new twist in jhansirani suicide case. husband affair with mother in law reason behind her death. nalgonda police hand over suicide letter.

ITEMVIDEOS: అత్తతో అక్రమ సంబంధం... భార్య బలి

Posted: 05/31/2016 03:50 PM IST
Husband affair with mother in law wife commits suicide in nalgonda

వావివరుసలు కానరాని ఆ మృగం వికృత చేష్టలకు దిగింది. అమ్మతో సమానమైన అత్తను బ్లాక్ మెయిల్ చేసి మరీ అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్త చేసే ఆ దుశ్చర్యలను చూస్తూ కొన్నాళ్లూ ఆ యువతి ఎంతో ఓపిక పట్టింది. బుధ్ది మారకపోవటంతో అతని నుంచి దూరంగా వెళ్లిపోదామని తల్లిని కోరింది. కానీ, అతనితో రుచి మరిగిన తల్లి కూతురిని వారించింది. ఏం చేయలేని నిస్సహా స్థితిలో ఆ యువతి చేరుకుంది. దీంతో ఓ లెటర్ రాసి తనువు చాలించింది. నల్గొండ జిల్లాలో సంచలనం సృష్టించిన బీటెక్ విద్యార్ధిని ఝాన్సీరాణి ఆత్మహత్య కేసులో పలు ట్విస్ట్ లు ఇప్పుడు బయటపడుతున్నాయి. దారుణమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

లేఖలో అసలేం ఉంది...
నకిరికల్ మండలం నోముల గ్రామానికి చెందిన ఝాన్సీ కుటుంబం ఆమె తండ్రి చనిపోయాక మూసీ రోడ్డుకు మకాం మార్చింది. సోదరుడు చిన్నవాడు కావటం, ఆదరించే మగతోడు లేకపోవటంతో ఝాన్సీ మేనబావ విజయేందర్ ఆ కుటుంబానికి అండగా నిలిచాడు. ఝూన్సీ చదువుతోపాటు, కుటుంబ పోషణార్థం 4 లక్షలు అప్పుగా ఇచ్చాడు. అయితే ఆ తర్వాతే అతడి అసలు స్వరూపం బయటపడింది. అప్పు వెంటనే తీర్చాలని లేకపోతే, ఝూన్సీని ఇచ్చి పెళ్లి చేయాలని ఆమె తల్లిపై ఒత్తిడి చేయసాగాడు. గత్యంతరం లేని పరిస్థితుల్లో తల్లి బలవంతం మేరకు ఝాన్సీ పెళ్లికి ఒప్పుకుంది. 2014 ఆగష్టులో వారి వివాహం జరిగింది. వేరే కాపురం పెట్టిన విజయేందర్ ఎక్కువ సమయం ఆమె పుట్టింట్లో గడుపుతున్నాడని ఝాన్సీకి అనుమానం వచ్చింది. తన సోదరుడు ఇంట్లో లేని సమయంలో ఆమె తల్లితో కలవటం కళ్లారా చూసి మనోవేదనకు గురైంది. ఇదే విషయాన్ని తల్లి దగ్గర ప్రస్తావించి విడాకులు తీసుకుంటానని చెప్పింది. దానికి తల్లి మౌనంగా ఉండగా, విజయేందర్ మాత్రం 20 లక్షలు ఇస్తే అంగీకరిస్తానని కండిషన్ పెట్టాడు. అంతేకాదు తనతో శృంగారంలో పాల్గొనకపోతే వ్యభిచార గృహానికి అమ్మేస్తానని బెదిరించడం మొదలుపెట్టాడు. ఈ తతంగం అంతటికి ఆమె తల్లి కూడా మద్దతు చెప్పటం ఘోరం. చేసేది లేక హైదరాబాద్ కు వచ్చి ఓ ప్రైవేట్ హస్టల్ లో ఉంటూ బీటెక్ విద్యను కొనసాగించింది ఝాన్సీ. పరీక్షలు ముగియటంతో తీసుకెళ్లేందుకు భర్త వస్తున్నాడని తెలిసి వణికిపోయింది. తల్లి, భర్తలు తనను తీసుకెళ్లి చంపే అవకాశాలు కూడా ఉండటంతో వెంటనే తెలంగాణ సీఎం కేసీఆర్ తోసహా, పలువురు ఉన్నతాధికారులకు, పోలీసులకు తన వ్యధను వివరిస్తూ లేఖలు రాసింది. అయితే లేఖలు ఆలస్యంగా చేరటంతో అప్పటికే ఆమె ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయింది.

అసలు ట్విస్టులు...
ఆమె రాసిన లేఖ ఈ నెల 28న పోలీసులకు అందింది. కాగా, ఆమె 24నే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. అయితే సూసైడ్ చేసుకున్నప్పుడు ఆ విషయాన్ని పోలీసులకు చేరవేయాలి. అది చేయకపోగా, గుట్టుచప్పుడు కాకుండా విజయేందర్ స్వగ్రామమైన దీపకుంటకు తీసుకెళ్లి అంత్యక్రియలు కానిచ్చేశారు. బంధువులు కూడా విచారణలో పొంతన లేని సమాధానాలు చెబుతున్నారు అంటే ఈ అక్రమ సంబంధం గురించి వారికి కూడా తెలిసి ఉండొచ్చని తెలుస్తోంది. ఆమె తనపై జరిగే వేధింపుల గురించే లేఖలో పేర్కొందే తప్పా ఎక్కడా ఆత్మహత్య చేసుకుంటానని చెప్పలేదు. పైగా తనకు ప్రాణహని ఉందని క్లియర్ గా రాసింది. దీనిని బట్టి ఆమెను హత్య కూడా చేసి ఉండొచ్చన్న అనుమానాలు పోలీసులు వ్యక్తం చేస్తూ ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు.


భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : btech student  jhansirani suicide case  nalgonda  

Other Articles