ఒక అమ్మాయి తన ప్రేమను ఒప్పుకునేంత వరకు కూడా ప్రపంచంలో వున్న సంతోషాలను ప్రేమికుడు తన మాటల ద్వారా ప్రేమను తెలియజేస్తూ వుంటాడు. ‘నువ్వంటే నాకు ప్రాణం.. అసలు నా ఊపిరే నువ్వు ప్రియ. ఈ ప్రపంచంలో నువ్వు తప్ప నాకు ఇంకెవరూ వద్దు. నువ్వు లేని క్షణం నాకు ఈ ప్రాణం వద్దు’ అంటూ రకరకాల డైలాగ్స్ చెబుతూ తను ప్రేమించిన అమ్మాయికి మాటలతోనే స్వర్గం చూపిస్తుంటారు అబ్బాయిలు.
కానీ ఒక్కసారి ఆ అమ్మాయి ఆ అబ్బాయి ప్రేమను ఒప్పుకున్న తర్వాత అసలు కథ మొదలవుతుంది. తను ప్రేమించిన అమ్మాయిని కాపాడుకునే ప్రయత్నంలో ఆ అబ్బాయి సహనం రోజురోజుకి పెరిగిపోతుంది. కానీ దీంతో ప్రేమ పేరుతో కిరాతకంగా మారి ప్రేమించిన అమ్మాయి ప్రాణాలు కూడా తీసే స్థాయికి రెచ్చిపోతున్నారు కొందరు కిరాతక ప్రేమికులు.
తాజాగా గుజరాత్ లో తను ప్రేమించిన అమ్మాయి తన మాట వినడం లేదని గొంతు కోసి పారిపోయాడు ఓ కిరాతక ప్రేమికుడు. వివరాల్లోకి వెళ్తే... సూరత్ లోని ఓ హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తున్న ఓ అమ్మాయి..అదే ప్రాంతంలో వున్న ఓ యువకుడితో ప్రేమలో పడింది. ఆ తర్వాత బాగానే వున్నప్పటికీ.. తాజాగా వీరిద్దరి హాస్పిటల్లో కలిసి కాసేపు మాట్లాడుకున్నారు.
అంతలోనే ఏమైందో ఏమో తెలియదు కానీ.. వీరిద్దరికి మనస్పర్థలు వచ్చాయి. తన ఆవేశం తట్టుకోలేని ఆ యువకుడు అమ్మాయిపై కత్తితో దాడి చేసి, ఆమె గొంతు కోసే ప్రయత్నం చేసాడు. ఆమె గొంతు కోస్తుండగా ఏదో శబ్ధం వినిపించడంతో బయపడి అక్కడి నుంచి ఆ యువకుడు పారిపోయాడు.
దీంతో వెంటనే ఆ అమ్మాయి ప్రాణాలు దక్కించుకొని అదే హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. ఈ సంఘటన అంతా కూడా అక్కడే వున్న సిసి కెమెరాలో రికార్డ్ అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి కిరాతక ప్రేమికుల వల్ల అమ్మాయిల తల్లితండ్రులు తమ కూతుళ్లను బయటకు పంపించాలంటేనే బయపడిపోతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more