పుదుచ్చేరి లెఫ్టెనెంట్ జనరల్ గా కిరణ్ బేదీ | Kiran Bedi appointed Lieutenant Governor of Puducherry

Kiran bedi appointed lieutenant governor of puducherry

Kiran Bedi, Puducherry, Lieutenant Governor, కిరణ్ బేది, పుదుచ్చేరి, కేంద్ర ప్రభుత్వం

Kiran Bedi, the country’s first woman IPS officer and the BJP’s chief ministerial candidate in the Delhi Assembly elections last year, was appointed Lieutenant Governor of Puducherry Sunday. The appointment came three days after the Congress-DMK alliance won 17 seats in the 30-member Puducherry Assembly.

పుదుచ్చేరి లెఫ్టెనెంట్ జనరల్ గా కిరణ్ బేదీ

Posted: 05/23/2016 09:51 AM IST
Kiran bedi appointed lieutenant governor of puducherry

పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌గా బీజేపీ నాయకురాలు, మాజీ ఐపీఎస్‌ అధికారిణి కిరణ్‌ బేడీ నియామితులయ్యారు. ఇందుకు సంబంధించి ఉత్తర్వులను రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ జారీ చేశారు.  కిరణ్‌ బేడీ గతంలో ఢిల్లీ పోలీస్‌ శాఖలో పనిచేశారు. రిటైరైనా తర్వాత సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారేతో కలిసి పలు ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఏడాది క్రితం జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగి ఘోర పరాజయం పొందారు. కృష్ణానగర్‌ నియోజకవర్గం నుంచి ఢిల్లీ సీఎం క్రేజీవాల్‌ చేతిలో ఓటమి పాలయ్యారు.దీంతో కిరణ్‌ బేడీ క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇక ఎన్నికల్లో పోటీ చేసే ప్రసక్తే లేదని అప్పట్లో ఆమె స్పష్టం చేశారు. కానీ, ప్రజా సేవ మాత్రం చేస్తానన్నారు. ఎట్టకేలకు బీజేపీ అధిష్టానం ఆమెకు లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ పదవిని కట్టబెట్టింది.

పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌గా తనను నియమించడంపై ఐపీఎస్‌ మాజీ అధికారిణి కిరణ్‌ బేదీ ఆనందం వ్యక్తంచేశారు. ఇదో అద్భుతమైన అవకాశంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఇలాంటి గొప్ప అవకాశం కల్పించిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. కిరణ్‌ బేదీని పుదుచ్ఛేరి లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌గా నియమిస్తూ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఆదివారం ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా కిరణ్‌ బేదీ మాట్లాడుతూ.. ప్రజల బాధలను అర్థం చేసుకొని వాటిని పరిష్కరించడమే జీవన పరమార్థమన్నారు. ప్రభుత్వానికి పనిచేయడం త్యాగంతో కూడిన సేవన్నారు. ప్రభుత్వ సేవ చేయడం తనకు ఇష్టమని, అందులో చాలా ఆనందం లభిస్తుందన్నారు. సేవచేసే ఇలాంటి బాధ్యతను తనకు అప్పగించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ పదవిని తాను అధికారంగా కాకుండా సేవగా భావిస్తానన్నారు. తనపై నమ్మకంతో ప్రభుత్వం ఉంచిన బాధ్యతను పూర్తిగా నెరవేరుస్తానన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles