If Priyanka Gandhi takes charge of Congress then BJP will face tough challenge

If priyanka gandhi takes charge of congress then bjp will face tough challenge

Priyaka Gandhi, Congress, AICC, Sonia Gandhi, Ram Dev baba, ప్రియాంక గాంధీ, రాందేవ్ బాబా

The Congress, which is reeling under severe electoral loses after facing humiliating defeats after defeats, can give tough challenge to the governing BJP if it brings Priyanka Gandhi at the helm, advices Yoga Guru Swami Ramdev.

ప్రియాంక వస్తే బిజెపికి ఇబ్బందే

Posted: 05/23/2016 09:33 AM IST
If priyanka gandhi takes charge of congress then bjp will face tough challenge

యోగా గురు రాందేవ్ బాబా రాజకీయాల్లో అప్పుడప్పుడు సంచలనం రేపుతుంటారు. ఆ మధ్యన భారతమాతకు వ్యతిరేకంగా మాట్లాడే వారి గురించి తీవ్ర వ్యాఖ్యాలు చేశారు. తాము పీకలు కొయ్యడం మొదలు పెడితే కోట్ల పీకలు తెగుతాయి అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాజాగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కూతురు ప్రియాంక గాంధీ వాద్రాపై పడింది. ఎందుకో కాని ఆయనకు ప్రియాంక గాంధీ చాలా పవర్ ఫుల్ ఉమెన్ గా కనిపిస్తోందట. అంతేకాదు ఆమె శక్తి యుక్తుల గురించి కూడా రాందేవ్ బాబా ఎక్కువగా ఊహించేసుకుంటున్నారు. పైగా ‘ఆమె కాని బరిలోకి దిగిందంటే.. బీజేపీకి ముచ్చెమటలు తప్పవు’ అంటూ రాందేవ్ బాబా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నవభారత్ టైమ్స్’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రాందేవ్ బాబా మాట్లాడుతూ... సోనియా గాంధీ కూతురు ప్రియాంకా గాంధీ వాద్రా పేరును ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు ప్రియాంక గాంధీ చేపడితే... బీజేపీ మరింత కష్టపడి పనిచేయాల్సి ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు.

కేంద్రంలో అధికార పార్టీ బీజేపీకి ఇప్పటికిప్పుడు వచ్చిన ఇబ్బంది అయితే ఏమీ లేదు అని రాందేవ్ బాబా అన్నారు. మూడు దశాబ్దాల తర్వాత స్పష్టమైన మెజారిటీతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని అన్నారు. త్రిపుల్ డిజిట్ నుంచి డబుల్ డిజిట్ కు పడిపోయిన కాంగ్రెస్ పార్టీ బలం.. లోక్ సభలో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష హోదాకూ ఎసరు పెట్టిన సంగతి తెలిసిందే. ఇదే విషయమై రాందేవ్ బాబా అభిప్రాయం కోరితే.. ఆయన ప్రియాంక గాంధీ పేరుని సూచించారట. చూడాలి మరి రాందేవ్ బాబా సలహాలను సోనియా గాంధీ ఏమైనా పరిగణలోకి తీసుకుంటారేమో.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles