పుష్కరాలకు సాయం చెయ్యాలని కేసీఆర్ లేఖ | KCR wrote a letter to Modi on Krishna Pushkaralu

Telangana cm kcr wrote a letter to modi on krishna pushkaralu

Telangana, Krishna Pushkaralu, CM KCR, KCR, Modi, మోదీ, కేసీఆర్, తెలంగాణ, కృష్ణా పుష్కరాలు

Telangana CM KCR wrote a letter to Modi on Krishna Pushkaralu. He rewuested to grant six hundred crore rupees for Krishna Pushkaralu.

పుష్కరాలకు సాయం చెయ్యాలని కేసీఆర్ లేఖ

Posted: 05/21/2016 07:19 AM IST
Telangana cm kcr wrote a letter to modi on krishna pushkaralu

తెలంగాణలో తొలిసారి కృష్ణాపుష్కరాలను ఘనంగా నిర్వహించడానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో భాగంగా కృష్ణా పుష్కరాల నిర్వహణకు ఆర్థిక సాయం కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం కేసీఆర్ లేఖ రాశారు. 601 కోట్ల ఆర్థిక సాయం కోరుతూ ప్రధానికి లేఖ రాశారు. తెలంగాణ ఏర్పాటయ్యాక తొలిసారి కృష్ణా పుష్కరాలు నిర్వహిస్తున్నామని వివరించారు. తెలంగాణలో కృష్ణా పుష్కరాలు ఆగస్టు 12 నుంచి 23 వరకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు కృష్ణా పుష్కరాలకు 825.16 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఆర్‌ అండ్ బీ, నీటిపారుదల, పంచాయతీ రాజ్ శాఖల ద్వారా రహదారులు, స్నానఘట్టాలు, మంచినీటి నల్లాలు తదితర నిర్మాణాల కోసం 744.85 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేశారు. అదనంగా మరో 80.31 కోట్లు ప్రత్యేకంగా విడుదల చేయాలని అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. పుష్కరాల్లో భక్తులకు అందే సౌకర్యాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు.

తెలంగాణ లోని మహబూబ్ నగర్,నల్లగొండ జిల్లాలలో కృష్ణా పుష్కరాలు జరుగనున్నాయి. రెండు జిల్లాల్లో కట్టుదిట్టమయిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. గోదావరి పుష్కరాలతో పోలిస్తే కృష్ణా పుష్కర ప్రాంతాలు భిన్నమయినవి. తెలంగాణలో కృష్ణా నది ప్రవహించే చోట మొసళ్ళు తిరుగుతుంటాయని, జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం అధికార వర్గాలను ఆదేశించింది. గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించిన తరహాలోనే ఈ ఏడాది ఆగస్టులో జరగనున్న కృష్ణా పుష్కరాలను కూడా విజయవంతం చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. గత పుష్కరాల సమయంలో మహబూబ్‌ నగర్‌ జిల్లాలో 17 ఘాట్లు ఏర్పాటు చేయగా ఈసారి అదనంగా మరో 35 ఘాట్లను నిర్మిస్తున్నారు. నల్లగొండ జిలాల్లో 11 ఘాట్లు ఉండగా మరో 23 ఘాట్లను నిర్మిస్తున్నారు. రెండు జిల్లాల్లో మొత్తం 86 పుష్కర ఘాట్ల నిర్మాణానికి ప్రభుత్వం 212 కోట్లు కేటాయించింది. కృష్ణా పుష్కరాలకు సుమారు 4కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామని..దానికి తగ్గట్లుగానే ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles