అమరావతి పేరు అతడే సూచించాడట! | Ramoji Behind Babu Choosing Amaravati

Ramoji behind babu choosing amaravati

Ramoji Rao, Chandrababu naidu, AP, Amaravathi, capital city, రామోజీరావు, అమరావతి, చంద్రబాబు

They say that media big head Ramoji Rao has a lot of influence on Chandrababu and at a recent event, the latter admits it revealing how Amaravati name came up as capital and how it is linked to Ramoji.

అమరావతి పేరు అతడే సూచించాడట!

Posted: 05/21/2016 07:16 AM IST
Ramoji behind babu choosing amaravati

నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని ‘అమరావతి’ ని సూచించింది ఎవరో తెలిసిపోయింది. ప్రముఖ వ్యాపారవేత్త, పత్రికాధినేత అయిన రామోజీరావు గారే నట. ఆయన సూచించడంతో నవ్యాంధ్ర రాజధానికి ‘అమరావతి’ పేరును పెట్టినట్లు చంద్రబాబు నాయుడు తెలిపారు. గతంలో అమరావతి ఎక్కడుందో కూడా ఎవరికీ తెలిసేది కాదని రాష్ట్ర విభజన తర్వాత అమరావతిని గురించి చర్చ మొదలైందన్నారు. రాజధానిలో భవనాలు మన సంస్కృతి, సంప్రదాయాలకు తగ్గట్లుగా ఉండాలనే ఉద్దేశంతో దేశీయ రూపశిల్పులతో ఆకృతులు తయారు చేయిస్తున్నట్లు చంద్రబాబునాయుడు వివరించారు.

ప్రముఖ పాత్రికేయుడు పొత్తూరి వెంకటేశ్వరరావు రచించిన 'ఆమరావతి ప్రభువు వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు' పుస్తకాన్ని సీఎం చంద్రబాబునాయుడు శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాతవాహనాల కాలంలోనే అమరావతి ప్రపంచంలోనే అతిపెద్ద వాణిజ్య కేంద్రంగా వెలుగొందిందని తెలిపారు. అలాంటి గొప్ప చరిత్ర ఉన్న ప్రాంతాన్ని తర్వాతి కాలంలో పరిపాలించిన వేంకటాద్రి నాయుడు గురించి పుస్తకం తీసుకురావటం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలోనే చంద్రాబాబు నాయుడు గారు అమరావతికి ఎందుకు రాజధానిగా చేసుకున్నారో, ఎలా ఆ ప్రాంతమే రాజధానికి సెలెక్ట్ అయ్యిందో తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles