Cyclone Roanu: Alert issued due to heavy rains in coastal Andhra, Odisha

Cyclone roanu to bring heavy rain to coastal ap

Andhra Pradesh,Odisha,Cyclone Roanu,Sri Lanka, Cyclone in AP, Cyclone in Odisha, Cyclone Roanu, Deep Depression, deep depression over west-central Bay of Bengal, ROANU, Weather

weather department has issued warning of heavy rains along coastal Andhra Pradesh and Odisha as cyclone Roanu is expected to move towards the Indian coastal region.

తీరప్రాంతంలో పెను కష్టం.. హుద్దూద్ గాయంపై రోనో ఫోటు..!?

Posted: 05/20/2016 02:21 PM IST
Cyclone roanu to bring heavy rain to coastal ap

శ్రీలంకలో పెను భీభత్సాన్ని సృష్టించి.. ఆంధ్ర, ఒడిషా తీర ప్రాంతాలపైగా బంగ్లాదేశ్ వైపు పయనమవుతన్న రోను తుఫాను.. తీర ప్రాంతాలలోనూ పెను భీభత్సం సృష్టించే ప్రమాదముందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫాన్ ఇంకా కొనసాగుతోంది. విశాఖకు 110 కి.మీ, కాకినాడకు 60 కి.మీ దూరంలో రోను తుఫాన్ కేంద్రీకృమైవుందని అధికారులు తెలిపారు. రోను ఇవాళ పెను తుఫానుగా రూపాంతరం చెందుతుందన్నారు.

అయితే బంగ్లాదేశ్ వైపు పయనముతున్న రోను తుఫాన్ ప్రభావంతో ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఒడిషాలో కూడా పెను గాలులు భీభత్సం సృష్టించే అవకాశం వుందని హెచ్చరిస్తున్నారు. ఈ గాలులు ప్రభావం ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా వుందని కాకినాడలో 100 కిలోమీటర్ల వేగం, ఇతర ప్రాంతాల్లో 90 కిలోమీటర్ల వేగం, మరో చోటు 60 కిలోమీటర్ల వేగంతో కూడుకుంటాయన్నారు.  వీటి ప్రభావం వల్ల ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని సమాచారం అందింది.

అన్ని ఓడరేవుల్లోనూ 4వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణశాఖ అధికారులు హెచ్చిరించారు. వాయుగుండం పెను తుఫాన్ గా మారి శనివారం అర్ధరాత్రి బంగ్లాదేశ్‌లో తీరం దాటొచ్చని ఐఎండీ అధికారులు వివరించారు. శ్రీకాకుళం జిల్లాలో కుండపోత వర్షం కురుస్తోంది. శ్రీకాకుళం డివిజన్ లో అత్యధికంగా 5 సెం.మీ వర్షపాతం నమోదైంది. తీర ప్రాంత మండలాల రెవెన్యూ సిబ్బందిని కలెక్టర్ అప్రమత్తం చేశారు. సముద్ర తీరంలో అలలు ఎగసి పడుతున్నాయి. తీర ప్రాంతంలో గంటకు 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి..

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Roanu cyclone  depression  north andhra  Cyclone  heavy rains  IMD  

Other Articles