విద్యార్థులకు నీట్ నుండి ఊరట | telugu students got exception from NEET

Telugu students got exception from neet

NEET, NEET Exam, Central Govt, Supreme Court, Medical Tests, నీట్, సెంట్రల్ గవర్నమెంట్, నీట్ పరీక్ష, తెలుగు రాష్ట్రాలు

The ordinance, which puts on hold a Supreme Court May 9 ruling ordering the implementation of National Eligibility cum Entrance Test (NEET) from this year, was cleared in a cabinet meeting under the chairmanship of Prime Minister Narendra Modi, official sources said.

విద్యార్థులకు నీట్ నుండి ఊరట

Posted: 05/20/2016 02:44 PM IST
Telugu students got exception from neet

దేశవ్యాప్తంగా విద్యార్థులను గందగోళంలో పడేసిన నీట్ నుండి తెలుగు విద్యార్థులకు ఊరట లబించింది. ఆలిండియా టెస్ట్ ద్వారానే మెడికల్ డెంటల్ కోర్సుల్లో అడ్మిషన్లు జరపాలని, అది ఈ ఏడాది నుంచే జరగాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పక్కన పెట్టింది కేంద్రం. నీట్ నిర్వహణను ఏడాది పాటు వాయిదా వేస్తూ ఆర్డినెన్స్ తెచ్చింది. ఈ ఉదయం సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రపతి ఆమోదముద్ర పడగానేఈ ఆర్డినెన్ష అమల్లోకి వస్తుంది.

రెండు దశల్లో నీట్ నిర్వహణకు కేంద్రం, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పచ్చజెండా ఊపినా ఈ ఆఖరి క్షణంలో నీట్ నిర్వహణ వల్ల వేలాది మంది విద్యార్థులు ఇబ్బంది పడతారని, వారిని గందరగోళంలో పడేయడం సరికాదని తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ సహా చాలా రాష్ట్రాలు కేంద్రం నిర్వహించిన ఓ సమావేశంలో మొరపెట్టాయి. సుప్రీంకోర్టు మాత్రం నిర్ణయాన్ని మార్చడానికి ససేమిరా అనడంతో ఓ రకమైన ప్రతిష్టంభన నెలకొంది. చివరకు రాష్ట్రాల అభిప్రాయాల సాకుతో కేంద్రం ఆర్డినెస్స్ మార్గాన్ని ఎంచుకుంది. దీని ప్రకారం ఈ ఏడాది ఏ రాష్ట్రానికారాష్ట్రం మెడికల్ పరీక్ష నిర్వహించుకోవచ్చు. అయితే ఎంసెట్ పరీక్ష పూర్తయిన ఆంధ్ర, తెలంగాణాల పరిస్థితి ప్రశ్నార్థకమైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles