ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు నేడే | Five States election result

Five states election result

elections, Assam, Tamilnadu, West bengal, Puducherry, Kerala, BJP, Congress, బిజెపి, తమిళనాడు, పశ్చిమబెంగాల్, కాంగ్రెస్, కేరళ, అస్సోం

Counting of votes begins at 8 am this morning for assembly elections in five states - Assam, West Bengal, Tamil Nadu, Kerala and Puducherry. Exit polls have predicted a BJP win in Assam, ending the 15-year reign of the Congress' Tarun Gogoi.

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు నేడే

Posted: 05/19/2016 08:31 AM IST
Five states election result

దేశవ్యాప్తంగా ఒక్కటే టెన్షన్.. ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు.? ఎవరు ఓడపోతారు.? పశ్చిమబెంగాల్ లో మళ్లీ మమత పాగా వేస్తారా? తమిళ పీఠం అమ్మదా, అయ్యదా? కేరళలో కాంగ్రెస్ కు వామపక్షాలు షాక్ ఇస్తాయా? అసోంలో తొలిసారిగా కమలం వికసిస్తుందా? పుదుచ్చేరిలో డీఎంకే సత్తా చాటుతుందా? ఈ ప్రశ్నలకు మరి కొన్ని గంటల్లో సమాధానం దొరకనుంది.ఐదు రాష్ట్రాలు. కీలక ప్రాంతాలు. దేశ రాజకీయాలపై ప్రభావం చూపగల సత్తా ఉన్నవి. ఆ ఐదు రాష్ట్రాలకు కాబోయే ముఖ్యమంత్రుల భవిష్యత్తు నేడు తేలిపోనుంది. నేటితో వారి సీఎం గిరీ ముగుస్తుందా? లేక మరో ఐదేళ్ల పాటు వారి పాలన కొనసాగుతుందా? అన్న విషయం నేటి మధ్యాహ్నం 3 గంటల్లోగా తేలిపోనుంది.

దేశంలోనే కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు సహా కేరళ, అసోం, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్ఛేరి అసెంబ్లీలకు ఇటీవలే ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు నేటి ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మేరకు ఓట్ల లెక్కింపునకు అవసరమైన అన్ని ఏర్పాట్లను కేంద్ర ఎన్నికల సంఘం పూర్తి చేసింది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన మూడు గంటల్లోనే ఆయా రాష్ట్రాల్లో ప్రజల ఎవరి వైపు మొగ్గు చూపారన్న విషయంపై క్లారిటీ రానుంది. మధ్యాహ్నం 3 గంటలకు దాదాపుగా ఓట్ల లెక్కింపు పూర్తి కానుంది. ఎగ్టిట్ పోల్స్ లో మిశ్రమ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ఐదు రాష్ట్రాల్లోనూ ఆయా పార్టీలు ఓట్ల లెక్కింపుపై ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. ఆ రాష్ట్రాల సీఎంలుగా ఉన్న మమతా బెనర్జీ(పశ్చిమ బెంగాల్), జయలలిత(తమిళనాడు), ఉమెన్ చాందీ(కేరళ), తరుణ్ గొగోయ్(అసోం), రంగసామి(పుదుచ్ఛేరి)లు మరింత ఆసక్తిగా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ఐదుగురిలో ఒక్క మమతా బెనర్జీ మినహా ఏ ఒక్కరికి ఎగ్జిట్ పోల్స్ లో పూర్తి స్థాయి అనుకూల ఫలితాలు రాకపోవడమే ఇందుకు కారణం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles