palair assembly by election favours which political party

Who is the winner in palair by election

Paleru by elections, Khammam district, Ramreddy Venkat reddy, Ramreddy Sucharita Reddy, Tummala Nageswara Rao, P Sudarshan Rao, TDP, YSR Congress, TRS, CPI-M, Congress

According to the sources, the ruling party has not left behind any chance in winning palair by election

పాలేరు ఫలితం ఎవరివైపు..? కాంగ్రెస్సా..? టీఆర్ఎస్సా..?

Posted: 05/18/2016 11:58 AM IST
Who is the winner in palair by election

పాలేరు ఉపఎన్నిక ఫలితం ఎవరికి అనుకూలంగా వుంటుంది. అధికార టీఆర్ఎస్ పార్టీకీ అనుకూలంగా ఆక్కడి ఫలితాలు మారుతాయా..? లేక సానుభూతి పవనాలతో పాటు రెండు పార్టీల మద్దతు లభించిన కాంగ్రెస్ కు ప్రజలు పట్టం కడతారా..? పాలేరు ప్రజా తీర్పు ఎవరి పక్షం.. ఎవరికి సానుకూలం.. ఎవరికీ ఖేదం..? ఇప్పుడీ ప్రశ్నలు ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పాటు అటు రాజకీయ వర్గాల నేతలను కూడా కలవరం పెడుడుతన్నాయి.

ఎలాగైనా ఈ ఎన్నికలలో విజయం సాధించి తమకు ఎదురు లేదని, మూడు పార్టీలు మిలితమైనా.. తమన ఉనికి ప్రశ్నించలేవని అధికార టీఆర్ఎస్ పార్టీ టిచెప్పాలనుకుంటుంది. అందుకనే చేతికి అందిన ఏ అవకాశాన్ని వదులుకోకుండా ముమ్మర ప్రచారాన్ని నిర్వహించింది. మరోలా చెప్పాలంటే పాలేరులోనే ప్రభుత్వం తిష్టవేసుకుని మరీ తమ పార్టీని గెలిపించుకునేందుకు నానా ప్రయసలు పడిందన్న టాక్ వినబడుతుంది. ఇంతలా అధికార పక్షం ఎందుకు కష్టపడాల్సి వచ్చింది...?

కాంగ్రెస్ శాసనసభ సబ్యుడు రాంరెడ్డి వెంకట్ రెడ్డి అకాల మరణంతో ఖాళీ అయిన ఈస్థానంలో ఆయనంటే విపరీతమైన సానుభూతి వుంది. ఎంతలా అంటే ఆయన సతీమణినే అక్కడి ప్రజలు బ్రహ్మరథం పట్టి గెలిపించేంతగా. దీంతో కాంగ్రెస్ అధిష్టానం అండతో బరిలోకి దిగిన రాంరెడ్డి సుచరితకు అటు టీడీపీ, ఇటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మద్దతు కూడా లభించింది. అయినా.. ఫలితం మాత్రం వారు ఊహించిన విధంగానే వుంటుందా..? లేక విభిన్నంగా వుంటుందా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

కాగా పాలేరు ఉప ఎన్నికలు టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉంటుందని సీపీఎం అంచనా వేస్తోంది. ఎట్టిపరిస్థితుల్లోనూ గెలవాలనే వ్యూహంతో 11 మంది మంత్రులు, 30 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను మోహరించి పెద్ద మొత్తంలో డబ్బును ఖర్చు చేసిందని, అధికార దుర్వినియోగానికి పాల్పడిందని అభిప్రాయపడింది. ఎంబీ భవన్‌లో జరిగిన పార్టీ రాష్ర్ట కార్యదర్శివర్గ సమావేశం ఉప ఎన్నికపై సమీక్ష నిర్వహించింది. కుల సంఘాలు, వర్గాల వారీగా సమావేశాలను నిర్వహించిన అధికారపక్షం వారిని బెదిరించడం, లొంగదీసుకోవడం వంటి అప్రజాస్వామిక చర్యలకు పాల్పడిందని నాయకులు అభిప్రాయపడ్డారు.

ఈ ఉప ఎన్నికల్లో అభ్యర్థిని నిలిపి.. రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు, టీఆర్‌ఎస్ అనుసరిస్తున్న అప్రజాస్వామిక ధోరణుల గురించి ప్రజలకు వివరించగలిగామని పేర్కొన్నారు. సీనియర్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్‌రెడ్డి మృతి నేపథ్యంలో జరిగిన ఎన్నికలో ఆయన కుటుంబంపట్ల ప్రజల్లో కొంతమేర సానుభూతి కనిపించినా, దానిని ఓట్ల రూపంలో మలచుకోవడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందనే అభిప్రాయం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో ఫలితం ఎలా వుండబోతుందన్నది మరో 24 గంటల్లో తేటతెల్లం అవుతుంది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Palair  by elections  Khammam  congress  TRS  CPM  YSR Congress  TDP  

Other Articles