రామోజీ పద్మం వెనక ఆ పెద్దాయన | That person behind Ramoji Rao Padma Award

That person behind ramoji rao padma award

Ramoji Rao, Padma Award, padma Vibhushan, Padma Awards, రామోజీరావు, పద్మ అవార్డు, పద్మ విభూషణ్

This year for 2016, all Telugu people might be feeling proud that media baron Ramoji Rao and superstar Rajnikanth were conferred Padma Vibhushan, while Tollywood sensation Rajamouli bagged the Padma Shri award. Who is behind Ramoji’s prestigious Padma Vibhushan award?

రామోజీ పద్మం వెనక ఆ పెద్దాయన

Posted: 05/16/2016 12:48 PM IST
That person behind ramoji rao padma award

తెలుగు మీడియాలో పెద్దన్నగా, తెలుగు రాజకీయాల్లో తెర వెనుక నుండి చక్రం తిప్పే వ్యక్తిగా పేరున్న రామోజీ రావుకు 2016కు గాను పద్మ విభూషన్ వరించింది. అయితే దీని మీద కొన్ని రాజకీయ పార్టీల నాయకులు పెదవి విరిచారు. రామోజీరావుకు కొంత మంది దన్నుగా ఉన్నారు కాబట్టే వాళ్లు పద్మ అవార్డుకు రికమెండ్ చేశారు అని వార్తులు వచ్చాయి. కాగా తెలుగు రాష్ట్రాల్లో పెద్ద బిజినెస్ మ్యాన్ గా, మీడియా టైకూన్ గా పేరున్న రామోజీరావుకు పద్మ అవార్డు రావడానికి తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్లు ఎవరూ కారణం కాదని తెలిసింది. అదేంటి మన వాళ్లు కాకుండా ఎవరు రికమెండ్ చేశారు అని అనుకుంటున్నారా..?

మీడియా ఛానల్స్ తో పాటుగా రకరకాల బిజినెస్ లు చేస్తున్న రామోజీరావుకు గుర్తింపునిస్తూ.. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ రికమెండ్ చేసినట్లు తెలిసింది. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద వచ్చిన ఓ దరఖాస్తు కోసం కేంద్రం నుండి వచ్చిన రిప్లై లో క్లీయర్ గా పేర్కొన్నారు. అసలు పద్మ అవార్డులను ఎలా ప్రకటిస్తారో కూడా ఆ రిప్లైలో ఉంది. మూడు రకాలుగా పద్మ అవార్డులకు అర్హులను గుర్తిస్తారు. అందులో మొదటిది.. రాష్ట్ర ప్రభుత్వాలు లేదా కేంద్ర పాలిత ప్రాంతాలు రికమెండ్ చేసే వ్యక్తులను సెలక్ట్ చేస్తారు. రెండవది.. పొలిటికల్ పార్టీలు లేదా సమాజం మీద ప్రభావం చూపించే సెలబ్రెటీలు రెకమండ్ చేసిన వ్యక్తులు. ఇక మూడవది.. తమకు తాముగా రెకమండ్ చేసేకోవడం ద్వారా అంటే బాబూ నేను ఇంతలా సేవ చేశాను కాబట్టి పద్మ అవార్డు ఇవ్వండి అని కోరడం అన్నట్లు. ఇందులో ఎక్కడా కూడా ప్రజాభిప్రాయాన్ని కోరడం ఉండదు.

-Abhinavachary

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles