Aditi Rao Hydari looks regal in a Ritu Kumar lehenga on the ramp

Bollywood actor aditi rao hydari stopped for flouting traffic rule

aditi rao hydari, aditi rao flouts traffic rule, aditi rao traffic rule, aditi rao police, aditi rao traffic police, aditi rao noida, aditi rao walks on road, ritu kumar designs, high street launch, fashion show, dlf mall of india, celebrity fashion

Wazir actress Aditi Rao Hydari was in the city to attend a fashion show and was staying in a five-star hotel in sector 18.

బాలీవుడ్ నటికి చుక్కలు చూపిన ధర్మేంద్ర

Posted: 05/16/2016 11:28 AM IST
Bollywood actor aditi rao hydari stopped for flouting traffic rule

హీరోయిన్లు సమాజంలో వారికంటూ ఓ మోస్తారు ఫాలోయింగ్ వున్న వ్యక్తులు. వాళ్లను సెలబ్రిటీలుగా చేసిన సమాజం పట్ల వారు ఆరాధ్యభావన కనబర్చకపోయినా.. కనీస తాము సన్మార్గంలో వెళ్లాల్సిన బాధ్యత వుండాలి. వారిని ఫాలో అవుతున్న వారికి సెలబ్రిటీలుగా వారిచ్చేది సుసందేశం కావాలి. కానీ అలాకాకుండా మేము సెలబ్రిటీలం.. మాకు రూల్స్ వర్తించవు.. మేము రమారమి భూమ్మిద దేవతలం అన్న ఫీలింగ్ కలిగితే మాత్రం.. ఇలా పరాభవం కూడా తప్పదు.

ఎలా అంటారా..? శయనానికి పట్టు పరుపులు, నడకకు ఎర్రని తివాచీలు, మెట్లు దిగితే క్యూలో కార్లు వచ్చి అగే స్థాయి వున్నా.. నడి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఓ బాలీవుడ్ హీరోయన్‌కు ఎదురైంది. తెలుగు గడ్డపై పుట్టి.. బాలీవుడ్‌లో హీరోయిన్‌గా వెలుగుతున్న అదితి రావుకు ఇలా చుక్కలు చూయించింది మాత్రం ఓ నాలుగో సింహమే. అందుకనే అమె నోయిడాలో నిర్వహిస్తున్న ఫ్యాషన్‌ షోకు నడిచి వెళ్లాల్సి వచ్చింది. దీనికి కారణం మాత్రం అమె చేసిన తప్పిదమే.

రాంగ్ రూట్‌లో వస్తున్నందుకు ఆమె కారును పోలీసులు సీజ్ చేయడంతో ఇలాంటి పరాభవం ఎదురైంది. నోయిడాలో అత్యంత ఖరీదైన సెక్టార్ 18లో కొత్తగా తెరిచిన మాల్‌లో నిర్వహించే ఫ్యాషన్ షోకు ఆమె వెళ్లాల్సి ఉంది. అదే సెక్టార్‌లోని ఓ ఫైవ్‌ స్టార్ హోటల్లో ఆమె ఉంది. అక్కడి నుంచి తన జాగ్వార్ కారులో ఆమె బయల్దేరగా, ఆమె సహాయకులు వెర్నా కారులో ఆమె వెంటే వెళ్లారు. అయితే.. త్వరగా వెళ్లాలన్న తొందరలో ఆమె డ్రైవర్ షార్ట్‌కట్ రూట్ తీసుకుని, రాంగ్ రూటులో నడపసాగాడు. అంతలో ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ ధర్మేంద్ర యాదవ్ వీరి కారును ఆపారు.

ఆపేసరికి అందులో ఎవరున్నారో తనకు తెలియదని, అయినా అలా వెళ్తే ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆపానని ఆయన చెప్పారు. కాసేపటికే వెనకాల వెర్నాలో వచ్చిన సహచరులు.. అది బాలీవుడ్ సెలబ్రిటీ కారని, అందువల్ల వదిలేయాలని కోరారు. కానీ, పేపర్ వర్క్ పూర్తి కాకుండా కారును పంపేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఈలోపు వెనకాల వచ్చినవాళ్లు నానా హడావుడి చేసి, మాల్ యాజమాన్యానికి ఫోన్లు చేశారు. అటు నుంచి వెంటనే కారును పంపాలంటూ ఇన్‌స్పెక్టర్‌పై ఒత్తిడి వచ్చింది. అయినా ఇన్‌స్పెక్టర్ మాత్రం కామ్‌గా తన పనిచేసుకుంటున్నారు. ఈలోపు అదితి రావు కిందకు దిగి, నడుచుకుంటూ మాల్‌కు వెళ్లిపోయింది. మరి సెలబ్రిటీ కదండీ.. ఈగో హర్ట్ అయ్యింది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles