స్టూల్ మీద జెట్ విమానం | US Marine Corps pilot lands jet on a stool

Us marine corps pilot lands jet on a stool

US, marine, Jet, Pilot, US Pilots, యుఎస్, మెరైన్,

This is a story which will make your adrenaline rush. A video which has gone viral on social media shows a US Marine Corps pilot Captain William Mahoney land his plane on a stool after his jet's front landing gear malfunctioned.Captain Mahoney had taken off from USS Bataan, part of the US Sixth Fleet, in his AV-8B Harrier aircraft and shortly realised that something was amiss.

ITEMVIDEOS: స్టూల్ మీద జెట్ విమానం

Posted: 05/12/2016 03:56 PM IST
Us marine corps pilot lands jet on a stool

ఏనుగు పిల్లను గూట్లో కూర్చోబెడతావా అని అడిగితే చిన్నప్పుడు.. ఓ ఏనుగు బొమ్మను తీసుకెళ్లి అందులో కూర్చోబెట్టిన కథ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. మరి నిజంగా ఇలాంటి అద్భుతాలు ఎలా జరుగుతాయి చెప్పండి. కానీ అనుకోవాలే కానీ అనుకున్నంతలో అన్ని జరుగుతాయి అన్నది మాత్రం వాస్తవం. తాజాగా అలాంటి ఓ అద్భుతమే జరిగింది. అనుకున్న కార్యాన్ని ఆత్మవిశ్వాసంతో ఎలా చేయొచ్చో ఓ పైలెట్ నిరూపించాడు. ఓ జెట్ విమానాన్ని ఏకంగా స్టూల్ మీద నిలిపి అందరికి ఆశ్చర్యాన్ని కలిగించాడు.

అమెరికాకు చెందిన యుద్ధ నౌక యుఎస్‌ఎస్ బతాన్ టేకాఫ్‌లో ఎటువంటి ఇబ్బందులు కలగలేదు. యుద్ధ విమానాన్ని ల్యాండ్ చేసే సమయంలో ముందు చక్రాలు తెరుచుకోవడంలేదు. దీంతో పైలట్ ఆందోళన చెందకుండా తన ప్లాన్‌ను అధికారులకు తెలిపాడు. నౌకపై విమానాన్ని దింపేందుకు తగిన ఏర్పాట్లు చేయమన్నాడు. పైలట్ విలియమ్ మహోనీ సమయ స్ఫూర్తితో పెను ప్రమాదాన్న తప్పించి అత్యంత జాగ్రత్తగా విమానాన్ని ల్యాండ్ చేశాడు. స్టూల్‌పై విమానం ముందు భాగం ఉండేటట్లు చేసి నెమ్మదిగా ల్యాండ్ చేశాడు. పెను ప్రమాదం తప్పటంతో అక్కడ ఉన్న అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. పైలట్ చేసిన ప్రయత్నాన్ని అందరూ మెచ్చుకున్నారు. పైటర్ జెట్ విమానానికి సంబంధించిన వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తోంది. నెటిజన్లు ఈ వీడియోను షేర్ల మీద షేర్లు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : US  marine  Jet  Pilot  US Pilots  యుఎస్  మెరైన్  

Other Articles