భార్యలను కొట్టడం ఎలా అంటే ఇలా.. | Saudi Therapist Gives Advice on Wife Beating

Saudi therapist gives advice on wife beating

Saudi Arebia, Wife, How to beat wife, సౌదీ అరేబియా, భార్యలను ఎలా కొట్టాలి

A Saudi Arabian family therapist has released a video giving his advice on wife beating. In the tutorial, Khaled Al-Saqaby says he is "aware that this issue is a thorny one, which contains many hazards".

ITEMVIDEOS: భార్యలను కొట్టడం ఎలా అంటే ఇలా..

Posted: 05/12/2016 03:40 PM IST
Saudi therapist gives advice on wife beating

ఎక్కడైనా ఇంగ్లీష్ మాట్లాడటం ఎలా..? అని పరీక్షలు పాస్ కావడం ఎలా అని..? వీడియోలు చూసి ఉండవచ్చు. డెమోలు కూడా చాలానే చూసి ఉండవచ్చు. కానీ సౌదీ అరేబియాలో మాత్రం ఓ వింత వీడియో బయటకు వచ్చింది. దాంట్లో భార్యలను భర్తలు కొట్టడం ఎలా అని ఓ ప్రబుద్దుడు వివరించాడు. సౌదీ అరేబియాలోని ఓ లోకల్ టీవీ ఛానల్ లోని ఓ ప్రొగ్రాంలో భాగంగా భార్యలను భర్తలు ఎలా కొట్టాలో.. ఎలా కొట్టకూడదో వివరంగా వివరించాడు. అయినా ఇదేం దిక్కుమాలిన ఆలోచన అని అనుకుంటున్నారేమో.. పనికి వచ్చే వాడికి ఆ ఐడియా పనికి వస్తే చాలు కదా. ఇంకా ఈ వీడయో గురించి తెలుసుకోవాలా..? అయితే చదవండి.

అరబ్ దేశాల్లో బాగా ఫేమస్ అయిన సౌదీ అరేబియాలో ఓ టీవీ ఛానల్ లోని ప్రోగ్రాంకు ఓ వ్యక్తి భార్యలను భర్తలు ఎలా కొట్టాలో వివరించాడు. ఖలీద్ అల్ సఖాబీ అనే వ్యక్తి ఫ్యామిలీ ధెరపిస్టుగా పని చేస్తున్నాడు. అయ్యవార్ల మాటలు వింటే అందరూ షాకవ్వాల్సిందే. భార్యలను కోపంతో కొట్టవద్దని. ఎంతో క్రమశిక్షణతో కొట్టాలని శెలవిస్తున్నారు. పైగా భార్యలను కొట్టేటైంలో ఇస్లాం  నిబంధనలను పాటించాలని కూడా అంటున్నాడు. భార్యలను ఇనుపరాడ్లతో కొట్టరాదని.. కర్రలను కూడా వాడకూడదని అంటున్నారు. పళ్లు శుభ్రం చేసుకునే చిన్న చువ్వలాంటిది కానీ కర్ఛీఫ్ తో కానీ కొట్టాలని అన్నాడు. అంతేకాదు కొట్టడానికి ముందు భర్తలు తమ హక్కులు.. భార్యల విధులు అల్లా ప్రకారం వారికి తెలియజేయాలట. దురదృష్టవశాత్తు కొంతమంది భార్యలు భర్తలతో సమానంగా జీవించాలని అనుకుంటారు. ఇదే పెద్ద సమస్యను సృష్టిస్తుందని అయ్యగారు వీడియోలో వెల్లడించారు. మొత్తానికి భార్యలను కొట్టడం ఎలాగో కూడా వీడియోలు వచ్చేశాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles