మోదీ సర్టిఫికేట్లు ‘నకిలీవే’?? | Is those Modi certificates are fake

Is those modi certificates are fake

Modi, Narendra Modi, Certificates, Delhi University, AAP, మోదీ, నరేంద్ర మోదీ, ఆప్, దిల్లీ యూనివర్సిటీ

Sharpening its attack on Prime Minister Narendra Modi, AAP on Wednesday alleged that Delhi University was "hiding facts", and VC Yogesh Tyagi was "living under pressure and fear". Four AAP members met Tyagi for nearly an hour, seeking details of Modi's BA degree.

మోదీ సర్టిఫికేట్లు ‘నకిలీవే’??

Posted: 05/12/2016 10:30 AM IST
Is those modi certificates are fake

ప్రధాని నరేంద్రమోదీ సర్టికేట్ల వివాదం ఎంతకూ ముగియడం లేదు. ఆప్ నాయకులు లేవనెత్తిన ఈ వ్యవహారం ట్విస్టుల మీద ట్విస్టులతో తీవ్ర దుమారానికి కారణమవుతోంది. అసలు మోదీ డిగ్రీనే  చెయ్యలేదని ఆప్ చేసిన వ్యాఖ్యలతో దుమారం రేగింది. దీనిపై స్పందించిన దిల్లీ పెద్దలు న్యూఢిల్లీలో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా మీడియా సమక్షంలో ప్రదర్శించిన ప్రధాని మోడీ సర్టిఫికెట్లు నకిలీవేనని 'ఆప్‌' నేత ఆశుతోష్‌ ఆరోపించారు. ప్రధాని మోడీ డిగ్రీ, పీజీ సర్టిఫికెట్లను క్షుణ్ణంగా పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుందని ఆయన వివరించారు. 1978 బ్యాచ్‌కు చెందిన డిగ్రీ విద్యార్థుల మార్కులు చేతి రాతతో ఉండగా, అదే సంవత్సరం డిగ్రీ పాసయిన ప్రధాని మోడీ మార్కులను కంప్యూటర్‌లో ప్రింట్‌ తీయడం ఎలా సాధ్యమైందని ప్రశ్నించారు.

అసలు 1978లో ఢిల్లీ యూనివర్సిటీలో కంప్యూటర్లు ఎక్కడ ఉన్నాయని ఆయన అధికారులను నిలదీశారు. మహారాష్ట్రకు చెందిన సమాచార హక్కు కార్యకర్త అనిల్‌ గల్‌గలి దాఖలు చేసిన దరఖాస్తుకు 3,4 దశాబ్దాల క్రితం నాటి రికార్డులు తమ వద్ద లేవని చెప్పిన డీయూ అధికారులు మోడీ సర్టిఫికెట్లను ఏ ఆధారాలతో నిర్ధారించుకున్నారని ఆశుతోష్‌ నిలదీశారు. 1978లో సర్టిఫికెట్లు చేతిరాతతో ఉండగా, మోడీ సర్టిఫికెట్లను ప్రింట్‌లో తీసుకోవడం సాధ్యమేనా? అనే అనుమానాలను ఆశుతోష్‌ వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles