వంద కోట్లు దొరికాయి | Police found near 100 crores

Police found near 100 crores

Tamilnadu, Elections, Tamilnadu police, తమిళనాడు, ఎన్నికలు

Police and Election commission found hundred crore rupees in Tamilnadu elections.

వంద కోట్లు దొరికాయి

Posted: 05/12/2016 07:33 AM IST
Police found near 100 crores

ఎన్నికలు వచ్చాయంటే చాలు డబ్బుల ప్రవాహం ఎలా ఉంటుందో అందరికి తెలుసు. తమిళనాడులో జరుగుతున్న ఎన్నికల్లో అయితే మరీ భీభత్సమైన ధన ప్రవాహం నడుస్తోంది. తమిళనాడు అసెంబ్లీ
ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయినప్పటి నుంచి తనిఖీల్లో 100 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రాజేశ్ లఖాని వెల్లడించారు. ఓటుకి నోటుని అరికట్టేందుకు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, యూత్ కమిటీలు, ఎన్నికల వ్యయ పరిశీలకులు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిఘా వేస్తున్నారు.

కొద్ది రోజులకు ముందు కరూరు, చెన్నై నగరాలలో అన్నాడీఎంకే నాయకుల నివాసాలు, పలు చోట్ల రూ.10 కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. విల్లుపురం జిల్లా విక్రవాండిలో మురళీధరన రెడ్డియార్‌ అనే వ్యక్తి నుంచి రూ.1.3 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే, విల్లుపురంలో ఓ జ్యువెలరీ దుకాణంలో దాచి ఉంచిన రూ.63 లక్షలను ఎన్నికల నిఘా విభాగం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శరతకుమార్‌ కారులోనూ రూ.9లక్షలు లభించాయి. ఇలా బుధవారంవరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.100 కోట్ల మేరకు నగదును స్వాధీనం చేసుకున్నామని ఈసీ తెలిపారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles